22 March, 2010

నువ్వు..నేను..ప్రేమ...

                                            
కనులు మూస్తే కలలో కనిపిస్తూ
కనులు తెరిస్తే ఊహవై కవ్విస్తూ....
హృదయపు తలుపులు తట్టి గర్వం గా చొరబడ్డావు...
నా మనసుని దోచుకుని మౌనం గా వెళ్ళిపోయావు..!!

కాలం కౌగిట్లో క్షణాలు కరిగిపోతుంటే
రాతిరి విడిపోయి వేకువలోకి జారుకుంటుంటే..
ఇన్నేళ్ళూ దరికి రాని ఆశలని ఆహ్వానిస్తూ
ఇన్నాళ్ళూ దాచుకున్న ఊసులన్నీ పంచుకుంటూ ...

మసక వెన్నెల్లో నువ్వూ - నేనూ కలిసిన ఆ క్షణాలే శాశ్వతమవ్వాలి!
ప్రేమికులమై ...ఈ ప్రపంచానికి మెల్లగా దూరమై ...మనం ఒకటి కావాలి ..!!

నీ కంటి పాపలో నన్ను చూసుకోవాలనీ ...
గుప్పెడంత నా గుండెలో నిన్ను దాచుకోవాలనీ ...
లెక్క లేనన్ని కోరికలతో ఎగసెగసి పడుతున్న మదిని ..
'నీ సొంతం ' అంటూ ఈ క్షణమే నీకు అప్పగించాలని ఉంది ..!!

స్వీకరిస్తావో  ...తిరస్కరిస్తావో .. ?!

13 comments:

  1. Manasa garu,
    chakkani bhavanni marinta chakkati picture to baga cheppaaru....inta andamga cheppina taruvaata tiraskarinche dhairyum evarikuntundi cheppandi...:)

    ReplyDelete
  2. :) చాలా బాగుంది... మరి ఏమన్నాడు?

    ReplyDelete
  3. :D Dileep, mee friend ye kada, you can guess it easily..He is bounded to say 'yes'.

    ReplyDelete
  4. If I have to guess Anil, first he will say "Tiraskaristaa"... Because u have given two options and he kinda doesn't like when you question him like that. he might think that you did not understand him. Generally he does what he thinks/feels. He doesn't do what he doesn't believe in. Even after sharing those moments, if you question him, he will say "no" with his mark smile. You only could sense the meaning of that smile :). Immediately he senses a feeling of rejection on your face. And then he recollects he said that to a girl and that too his wife. And then he tries to woo you and pour out his heart's content... :)
    And finally you will understand what he means without he having to say it.

    ReplyDelete
  5. At last, this piece found its place...

    మానస: ఎంత బాగుందో కదా! విశాలమైన సముద్రం, ఎదురుగా నువ్వూ నేనూ...
    మానస: అనీల్! వింటున్నావా?
    అనిల్: గట్టిగా చెప్పు, హోరులో సరిగా వినబడటం లేదు.
    మానస: దగ్గరగా రా...
    అనిల్: హా చెప్పు.
    మానస:అల, కాలం ఎవరికోసమూ ఆగవంట!
    అనిల్: అయితే ఏంటంట? :-B :-D
    మానస: అనీల్! :-|
    అనిల్: చెయ్యి ఇవ్వు
    మానస: నేనేమీ పడిపోను X-(, నా అంతట నేను అలని ఎదిరించగలను. నాకేమీ భయం లేదు.
    అనిల్: రా...
    మానస: ఊ
    అనిల్: నువ్వూ నేనూ ఇలా కలిసి ఉన్నంత వరకు, నాకు ఆ అల, ఈ కాలం స్తంభించిపోయినట్టే ఉంటుంది. మన కోసమే ఆగిపోయినట్టు ఉంటుంది.
    మానస: హమ్మ్...
    అనిల్: చూడు, ఆ అల అక్కడే ఉంది. ఈ క్షణం కూడా మన మధ్య ఎలా బందీ అయిపోయిందో!
    మానస: :x :">
    అనిల్: నువ్వు నన్ను ఇలానే పట్టుకుని ఉంటే ఒక సముద్రం కాదు, జీవితం ఏడు సముద్రాలంత విశాలమైనా ఈదేస్తా... ఒక జన్మ కాదు, ఏడు జన్మలూ నీతోనే ఉంటా...
    మానస: >:D<

    ReplyDelete
  6. :)) Nice imagination..:). Thank you evry much for thinking on my behalf as well .
    and hey! naa miglina posts kuda choostoo undandi.
    Mee friend peru lekapote chadavara?

    ReplyDelete
  7. matallo cheppalenidi kavithlo ....bagundi manasa garu !

    ReplyDelete
  8. మాటల్లో చెప్పలేనిది కవితలో బాగుంది మానస గారు

    ReplyDelete
  9. "ఆ క్షణాలే శాశ్వతమవ్వాలి" idi Elico lo cheppina tavitka kadaa :) -- Subbu

    ReplyDelete
    Replies
    1. Nonono!!! Written after I had met him:-) nu vu ippudu kottagaa cheppaku:-) . as tavika Vere, mail lo pamputaa, chadi pedataaventee..? :p

      Delete