కోల్పోయిన అనంతానంత క్షణాల కోసం హృదయం వెర్రిగా వెంపర్లాడటం మానలేనంటుంటే, ఓదార్చే ఏకాంతం కోసం పరితపించే ప్రవృత్తి పదే పదే మనసుని మెలి పెడుతుంటే, గతం ముల్లయి గుండెను గుచ్చిన ప్రతి సారి అనుభవాలు ఎర్రని రక్తపు చుక్కలై నా బతుకంతా మరకలు వేస్తున్నాయని నీకెవరు చెప్తారు.
ఎందుకు కలగన్నానో తెలీదు, శరద్రాత్రుల్లో కలిసి తిరుగాడినట్టు. స్వర్గ లోకాల ద్వారాలు, నీ చేతులు పట్టుకోగానే తెరుచుకున్నట్టు. సరోవరాలంత స్వచ్ఛంగా మెరిసే నీ కళ్ళల్లోకి చూసిన ప్రతిసారీ, కలిసి గడపబోయే జీవితం కోసం ఎందుకు ఆశ పడ్డానో తెలీదు! అజ్ఞాత తీరాల్లోని కాలాతీత స్నేహమణి కోసం, శాపం నుండి శోకం నుండి విముక్తురాలిని కావడం కోసం ఇంకా ఎన్నాళ్ళీ ప్రతీక్ష సాగాలో ఎవరు చెప్తారు నాకు!
ఈ శరీరానికి ఇన్ని శక్తులున్నాయి కానీ, మనసుకు రెక్కల్లేవు! ఉండుంటే ఈ దూరం ఇంత ధైర్యంగా, నిర్దయగా నా ముందు నిలబడగలిగేది కాదు! ఈ లోతుల్లోని భావావేశాలు నిన్ను చేరలేక మళ్ళీ మళ్ళీ మనసు అగాధాల్లోకే నిష్ఫలంగా జారిపోయేవీ కావు!
శ్రావణ మాసపు నిశీధిలో లోకమంతా కుంభవృష్టికి చివికిపోతునప్పుడు, రాత్రంతా మేలుకుని నీతో కబుర్లు చెపుతూ అలాగే నిద్రపోయిన రోజులు గుర్తు చేసుకుంటాను. కన్నీటిజాలు పెదవులకు ఉప్పగా తగిలి వర్తమానం ఒళ్ళో పడేస్తుంది. రెప్పల మీద సుపరిచితమైన వేదనానుభూతి తిరిగి తన ముద్రలు వేసి వెళ్లిపోతుంది.
నీకెవరు చెప్తారిప్పుడు, జీవితం కలలు భగ్నమయ్యాక మిగిలిన కలవరంగా గడచిపోతోందని; గొంతులో ఇన్నాళ్ళూ పల్లవించిన ప్రణయ గీతాలన్నీ నిశ్శబ్ద కుహరంలోకి నిష్క్రమించి నిదురపోయాయని.
"గాలిలో తలిరాకు వలె
లోల వీణా తంత్రి వలె
బేలయై ప్రియురాకకై ఊ-
యాల లూగే మనసు నిలుపుట
ఎంత బాధ చెలీ! "
-అని పాడుకుంటూ తడికళ్ళు తుడిచే వాళ్ళు రారని తెలిసీ తపిస్తున్నాననీ,
తిరస్కారానికి ఛిద్రమైన ప్రేమానుభవమంతా ఈ ఆత్మ విహారానికై రెక్కలు చాస్తోందని, నిరీక్షిస్తోందని..........
ఎవరైనా ఏనాటికైనా చెప్తారా నీకు ?
wow!
ReplyDeleteWow!
ReplyDeleteప్రతి వాక్యమూ అద్భుతంగా ఉంది.
ReplyDeleteManasuki rekkalunnayi... kani.... manisi ki rekkalu levu... andhuke dhuranni anukunna kshanam jayincha leka pothunnavemo...
ReplyDeleteWow! ఇలాంటి వాక్యాలు ఒక్కటి కూడా రాయలేను :-( చాలా బాగా రాశారు.
ReplyDeleteవావ్.. మానస గారూ.. అద్భుతం అన్నది చాలా చిన్న పదం అవుతుంది, మీ రచన గురించి చెప్పాలంటే..
ReplyDeleteప్రతి వాక్యం ప్రతి పదం, ఎంత అందంగా ఉన్నాయంటే వాటిని కనీసం నాకు తెలిసిన పదాలతో అయినా వర్ణించలేకపోతున్నా.. సూపర్బ్...
మీ రాతల మాయాజాలంలో పడి కొట్టుకుపోతూ, మోయలేని ఆనందాన్ని, బాధంత తీవ్రమైన సంతోషాన్ని సొంతం చేసుకుని మీ అక్షరాల ఇంద్రజాలంలో మది మునకలేస్తూ ఉందని ఎలా చెప్పాలి మీకు?????
భలే వారే మానస గారూ, మనసుకి కలిగిన ఇష్టాన్ని వర్ణించడానికి ఏ మాటలందించాలో అర్థం కాక, ఇష్టమైన దాన్ని చేరడానికి బోలెడంత కష్టపడాల్సొస్తుందన్న విషయాన్ని మరోసారి గ్రహించి, ఏదో నాకు చేతనైనంతలో, తోచినట్లు పదాల కూర్పు అందించాను మీకు. నిజంగా.. నాకు మాటలు కరువయ్యాయి మీకు వ్యాఖ్య పెడదాం అంటే. మీరన్నది (భావాలకి పట్టు దొరకని) అక్షరాలా నిజం.. "మాటలు అన్ని వేళలా సహకరిస్తే ఎంత అదృష్టం. "
ReplyDeleteSuperb ga vundhi mee kavitha
ReplyDeleteచాలా.........అద్భుతంగా..........
ReplyDeleteనిజమె! మాటలు అన్ని వేళలా సహకరిస్తే ఎంత అదృష్టం!!
Manasa garu, your words are superb...i am sure that i can not write like you. keep going...
ReplyDeletewow.. adbhutamgaa undi.. aa feelings lo unna intensity adirindi.. paatralloki parakaaya pravesam chesi raasinattundi.. hats off to u..
ReplyDeleteಮಾನಸ ಗಾರೂ,
ReplyDeleteಎವರೂ ಚೆಪ್ಪಕ ಪೋಯಿನಾ ತೆಲಿಯಟಮೇ ದಾನಿ ಪ್ರತ್ಯೇಕತ.