tag:blogger.com,1999:blog-2312195244229149020.post3117286830633852370..comments2023-06-13T16:42:48.597+05:30Comments on మధుమానసం: చలం-బ్రాహ్మణీకం-కొన్ని ఆలోచనలుManasa Chamarthihttp://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-2312195244229149020.post-29367552329636692272019-11-27T10:30:02.975+05:302019-11-27T10:30:02.975+05:30బ్రాహ్మణికం మీద రాసిన సమీక్ష ఎంత ఆలోచింపజేసింద...బ్రాహ్మణికం మీద రాసిన సమీక్ష ఎంత ఆలోచింపజేసిందో, దానికి స్పందించిన పాఠకుల వాఖ్యలు కూడా ఎన్నో దృక్కోణాలను చలం సాహిత్యంలో పరిచయం చేస్తూ ఆలోచింపజేస్తుంది. 'ఆవిర్భవ' పక్ష పత్రికలో పుస్తక దర్పణం ఉంది. దానితో పాటు ఆసక్తి ఉన్న సాహితీవేత్తలు మీ రచనలు radioavirbhava@gmail.comకి పంపవచ్చు. ఆవిర్భవ గత సంచికలు ,ఆవిర్భవ ఆన్లైన్ గ్రంధాలయం చదవాలనుకుంటే www.avirbhava.live ని వీక్షించవచ్చు. గత సంచికలను వెబ్సైట్ తో పాటు readwhere లో కూడా చదవచ్చు.https://www.readwhere.com/read/2420733/Avirbhava-sixth-Edition-November-16th-2019/Avirbhava-sixth-Edition-November-16th-2019
ధన్యవాదాలు . Mandodari Muchhatlu with Rachana Sri Dutta https://www.blogger.com/profile/00378887815288981062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-25247170700730398892012-10-31T17:57:30.954+05:302012-10-31T17:57:30.954+05:30Woman in any caste ,need not only brahmin will...Woman in any caste ,need not only brahmin will pray fall in the hands of cheats like Chandra Sekhar . Sundaramma need not be brahmin woman. Is Chalam wish to say , only brahmin woman is innocent like sundarama?Durgahttps://www.blogger.com/profile/06751504643086727322noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-73869116424813314152012-10-27T16:35:28.562+05:302012-10-27T16:35:28.562+05:30This comment has been removed by the author.Durgahttps://www.blogger.com/profile/06751504643086727322noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-73676766088160839802012-03-23T13:02:08.223+05:302012-03-23T13:02:08.223+05:30జీవించడం, జీవితాన్ని అర్ధం చేసుకోవడం ఈ రెండూ వేర్వ...జీవించడం, జీవితాన్ని అర్ధం చేసుకోవడం ఈ రెండూ వేర్వేరు విషయాలు అంటారు సంజీవదేవ్. నిజమే. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టిన వెంటనే జీవించడం నుంచి పక్కకు తొలుగుతారు. ఒక అనుభూతిగా జీవితాన్ని పరిమితం చేసుకునేలా ఉన్న శరీరం, మనసునుంచి - ఒక అనుభవం - ఒక అన్వేషణ- ఒక అంతర్యానం వైపు మళ్ళేందుకు చాల కాలం -దూరం ప్రయాణం అవసరమవుతుంది. స్త్రీ ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టెందుకు తొలి మలి నాగరికతలు సహకరించలేదు. ఆధునికాంతర తొలిపాదం ఆమెదే. కాని ఆమె అందుకు సిద్ధమా? సౌందర్యాన్ని, ప్రేమనూ స్వేచ్చగా తీసుకొని, ఇవ్వగలిగిన హృదయం ఆమెది. కాని, ఇవ్వడానికి ఒక పువ్వులొ ఉన్న సహజత్వం- నాగరికత నిర్మాణంలో లేదు. అది తీసుకునేందుకు -సంకెళ్ళను పెంచుకునేందుకు సర్వదా సిద్ధం.
ఉన్న స్వేచ్చను తనదైన బంగారు సంకెళ్ళలోనో, పంజరంలోనో బంధించుకొని స్వేచ్చ అని అరుస్తుంది.
ఇక చలం , "పిచ్చివాడు, కళాకారుడు, ప్రేమికుడి మానసిక స్థితి ఒకేలా ఉంటుందన్నట్లు" అందుకు ఆయనే ఒక ఉదాహరణ. ఏకకాలంలో మూడూ. కొందరికి అవి జీవితంలో భాగం, చలానికి ఆ మూడూ జీవితం. ఆయన పాత్రలు ఆయనే- మారుపేరు, ఒక స్వేచ్చ. అవి స్త్రీని ఆకర్షిస్తూనే ఉంటాయి.బృందావనంhttps://www.blogger.com/profile/18276622511656159586noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-12003385495522210042012-03-21T07:24:36.930+05:302012-03-21T07:24:36.930+05:30Dear Naresh Nunna,
I was not aware about the orig...Dear Naresh Nunna,

I was not aware about the original at all; Now that you have given a hint to me, I will try to get that book from friends. I will write a second review on Brahmaneekam then, and perhaps that makes it complete.

Thanks for the details and suggestion.

Regards,
ManasaManasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-18600997129403278092012-03-20T22:59:43.519+05:302012-03-20T22:59:43.519+05:30Why none of the above referred to/ commented on th...Why none of the above referred to/ commented on the original H G Wells' Passionate Friends? The same has been adapted to screen by renowned director - David Lean. Dear Manasa Chamarthi, try for the book and through some more light on Chalam gari బ్రాహ్మణీకంnareshnunnahttps://www.blogger.com/profile/03413538839786932270noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-55513759121102038462011-06-21T04:19:41.773+05:302011-06-21T04:19:41.773+05:30heyyyyyyyyyyyy manasa,,how r uheyyyyyyyyyyyy manasa,,how r upavanhttps://www.blogger.com/profile/05276274487314803409noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-55010665984635098812011-06-08T10:43:33.808+05:302011-06-08T10:43:33.808+05:30లలిత గారూ,
మీరన్నది నాకు సరిగ్గానే అర్థం అయింది :)...లలిత గారూ,
మీరన్నది నాకు సరిగ్గానే అర్థం అయింది :). మీ బ్లాగ్ చాలా కలర్ఫుల్గా , ఆసక్తికరంగా ఉంది. బహుశా అక్కడే ఎప్పుడో మిమ్మల్ని కలిసి ఉంటాను.

ఇక ఈ మాటను గురించి :"చలం స్త్రీలని అర్థం చేసుకున్నాడంటే ఒప్పుకోవాలనిపించదు."

బ్రాహ్మణీకాన్నే తీసుకుంటే, కొన్ని సన్నివేశాల్లో వేరే యే రచయిత అయినా కథను కొనసాగించడానికి వేరే మార్గాన్ని ఎంచుకుంటాడేమో అనిపిస్తుంది. ముఖ్యంగా శేఖరం సుందరమ్మను ప్రలోభపెట్టే సన్నివేశాల్లో !అక్కడ స్త్రీ సహజమైన జాలిని, సహృదయాన్ని చలం చాలా ఖచ్చితమైన పదాలను వాడుతూ ప్రొజెక్ట్ చేసినట్టు నాకనిపించింది.

అలాగే, ప్రేమలేఖల్లో కొన్ని పేజీలుంటాయి...ఉత్తరం చదవగానే ఏం చెయ్యాలో చెపుతూ. అది చాలా టిపికల్ రెస్పాన్స్ నా దృష్టిలో. అలాగే స్త్రీలో సహజంగా పురుషుడు తన పట్ల ప్రేమతో వ్యవహరించకపోతే జీవితంలో అన్నింటి పట్లా కలిగే వైరాగ్యం ఇతరత్రా కూడా చలం బాగా వ్యక్తపరచగలిగాడు అనిపిస్తుంది.

ప్రపంచంలోని స్త్రీలంతా ఇంతే అన్నది కాదు నా ఉద్దేశం. సుందరమ్మలా మంచితనంతో జీవితాలు నాశనం చేసుకుంటారనీ కాదు. అయితే మనం ఎన్నో సార్లు కేవలం చూసి వదిలేసే సున్నితమైన అంశాలని అంత ప్రతిభతో రచనగా మలచడం చలానికే సాధ్యమైనదన్న భావనే నన్ను చలాన్ని పొగిడేలా చేసింది :)

మరొకటి :" చలం చూపించిన చొరవకి ఆ ముగింపులు పూర్తి వ్యతిరేకం కదా!" - ఇది నాకూ అనిపించింది. అలాంటి రచనలూ ఎమైనా ఉన్నాయేమో వెదికి సాధించి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-69885201756687541122011-06-04T11:39:54.821+05:302011-06-04T11:39:54.821+05:30స్త్రీ సహజ ముగ్ధత్వం అనే మాటకి చలానికి తెలిసినట్టు...స్త్రీ సహజ ముగ్ధత్వం అనే మాటకి చలానికి తెలిసినట్టుగా అర్ధం ఇంక ఏ మగాడికి తెలియదనుకుంట..Mohan Talarihttps://www.blogger.com/profile/14848025443460040770noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-85163441762999049132011-06-04T05:39:10.946+05:302011-06-04T05:39:10.946+05:30అనసూయ - ఇది మరో బ్రాహ్మణీకం కథ http://literature.m...అనసూయ - ఇది మరో బ్రాహ్మణీకం కథ http://literature.mlmedia.net.in/2010/06/blog-post_04.htmlPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-30430839580772215102011-06-04T05:17:38.943+05:302011-06-04T05:17:38.943+05:30Nice review Manasa Garu.
-MaitreyiNice review Manasa Garu.
-MaitreyiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-37096039803295631002011-06-04T04:10:04.523+05:302011-06-04T04:10:04.523+05:30ప్రముఖ మార్క్సిస్ట్ రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి...ప్రముఖ మార్క్సిస్ట్ రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి గారు అన్నారు "చలం గారు లేకపోతే తెలుగు సాహిత్యం విశ్వానాథ సత్యనారాయణ వంటి వారి ఫ్యూడల్ భావజాలంతో లేదా గాంధేయవాదం లాంటి ప్రతిరోధక వేదాంతాలతో కుళ్ళిపోయేది" అని. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని బతికించినవాడు చలం. అందుకే నాకు చలం గారంటే అంత అభిమానం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-17255822302062212342011-06-04T03:47:07.442+05:302011-06-04T03:47:07.442+05:30చలం గారి నిజ జీవితంలో జరిగిన ఘట ఇది. చలం గారి cous...చలం గారి నిజ జీవితంలో జరిగిన ఘట ఇది. చలం గారి cousin (పెదనాన్న గారి కూతురు) పేరు రమణ. చలం గారు తన చిన్నప్పుడు రమణతో ప్రేమలో పడ్డారు. Straight cousinsని పెళ్ళి చేసుకోవడానికి భారతీయ సమాజం అంగీకరించదు. Cross cousins (మేనత్త పిల్లలు)ని పెళ్ళి చేసుకోవడానికి మాత్రమే ఇక్కడి వాళ్ళు ఒప్పుకుంటారు. రమణతో పెళ్ళికి అతని పెద్దలు అంగీకరించలేదు. అతన్ని చిట్టిరంగనాయకమ్మ అనే ఆమెకి ఇచ్చి పెళ్ళి చేశారు. చలం గారి బంధువులలో కొందరు స్త్రీలు కట్టుబాట్ల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి నిజజీవిత కథల్ని నవలలలో చూపించారు. అనసూయ కథలో జరిగిన ఘటనలు పూర్వం మా కుటుంబంలోనూ జరిగాయి. ఆస్తి కోసం మనవాళ్ళు ఆడదాని న్యాయాన్ని ఏమాత్రం లెక్కచెయ్యరు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-36827475806556442652011-06-04T01:20:50.764+05:302011-06-04T01:20:50.764+05:30"ఇంతవరకూ చదివినవి" ఏమిటో నా వ్యాఖ్య మొదట..."ఇంతవరకూ చదివినవి" ఏమిటో నా వ్యాఖ్య మొదట్లో వ్రాశాను.
నా ఉద్దేశ్యం చలం గారి రచనల గురించి నేను చదివిన వాటిల్లో అని.
మానస గారి వ్రాతలతో ఈ టపాతోనే ఇప్పుడే పరిచయమయ్యింది నాకు.
పేరు లీలగా గుర్తుకు వస్తోంది, వ్యాఖ్యలలో / వ్యాఖ్యల ద్వారా ఎక్కడైనా చూశానేమో మరి.
వీరి మిగిలిన టపాలు చదవాలన్న ఆసక్తి కలిగింది ఈ టపా చదివాక.
వయసు ప్రసక్తి ఇక్కడ అనవసరం అనుకుకుంటాను.
ఎందుకని అంతలా నన్ను అన్నారో అర్థం కావట్లేదు.
మీకు అనిపించింది అని కాకుండా నేను అనేశాను అనేస్తే మరి నాకూ బాధ వేస్తుంది.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-65904963862534700052011-06-03T22:02:07.148+05:302011-06-03T22:02:07.148+05:30సవరణ: మానసా అని రాసాను తొందరలో మానస గారు అని చదువు...సవరణ: మానసా అని రాసాను తొందరలో మానస గారు అని చదువుకొనేది.
SrIRamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-28532335014217412832011-06-03T21:59:31.038+05:302011-06-03T21:59:31.038+05:30* ముందుగా ఇంతవరకూ చదివిన వాటిల్లో ఈ టపా చాలా బాగా ...* ముందుగా ఇంతవరకూ చదివిన వాటిల్లో ఈ టపా చాలా బాగా రాశారు అనిపించింది.*
లలిత గారు, మీ పైవాఖ్యం అర్థం ఎమిటి? ఇంత క్రితం రాసిన కొన్ని టపాలు పెద్దగా బాగ లేవనా? నేను ఈ బ్లాగు కి గొప్ప అభిమానిని. మానసా చామర్తి బ్లాగులోకంలో లేడి చలం. ఆమే రాసిన కవిత్వం చదవండి. చలం రాసిన యశోద గీతాలను గుర్తుకు తెస్తాయి. అటువంటి మానసను ఎదో వయసులో చిన్నది గదా అని ఈ టపా బాగ రాశారు అని అంటం ఎమీ బాగా లేదు.

SriRamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-90320551840858284642011-06-03T20:29:40.775+05:302011-06-03T20:29:40.775+05:30ముందుగా నా చలం సాహిత్యం విషయంలో నా అజ్ఞానమే ఎక్కువ...ముందుగా నా చలం సాహిత్యం విషయంలో నా అజ్ఞానమే ఎక్కువ జ్ఞానం కంటే.
నేను చదివినవి ఆయన రాసిన కొన్ని చిన్న కథలు అవి కూడా అంతర్జాలంలోనే.
అవి కాక ఇక ఇలాంటి సమీక్షలూ, విశ్లేషణలూ, వాదోపవాదాలూను.
తెలియని దాంట్లో తలెందుకు దూర్చడం, "విభూషణం మౌనమపణ్డితానాం" అని తెలిసి కూడా అంటే ...ఆ తెలివి కూడా నాకు లేదని ఒప్పుకుంటాను :(
ఇక్కడ చలం స్త్రీలని అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుకుంటుంటే నాకనిపించిన రెండు ముక్కలు చెప్పాలనిపించింది.
ఐతే ముందుగా ఇంతవరకూ చదివిన వాటిల్లో ఈ టపా చాలా బాగా రాశారు అనిపించింది.
భాష, భావ వ్యక్తీకరణ విషయాల్లలో చాలా బాగా అనిపించింది.
చలం స్త్రీలని అర్థం చేసుకున్నాడంటే ఒప్పుకోవాలనిపించదు.
మగ వారి మనస్తత్వాన్ని కపటం లేకుండా బయట పెట్టాడు అంటే బావుంటుందేమో.
ఆ నాటి స్త్రీ పరిమితులను ఆయా కథల ముగింపులు తెలియ చేస్తాయి అన్న వ్యాఖ్య ముందు నాకు తెలియని విషయాన్ని స్పష్టం చేసినట్టనిపించింది. కానీ, ఆలోచిస్తే, చలం చూపించిన చొరవకి ఆ ముగింపులు పూర్తి వ్యతిరేకం కదా. చలం జీవితం ఆయన రచనలు, ఆయన రచనలు ఆయన జీవితం అని అనిపించేటట్లుగా నాకు ఇంతవరకూ నేను చదివి పెంచుకున్న (అ) జ్ఞానం వల్ల అర్థమైనందున ఆయా పాత్రలు సంఘర్షణను చూపిస్తున్నాయి అని మాత్రమే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను.
ఐతే కాలానుగుణంగా వచ్చే మార్పులలో చలం చిత్రీకరించిన సంఘర్షణలు ఒక వాదానికి ఎక్కువ బలాన్ని ఇచ్చేవిగా అనిపించవచ్చు.
అది అతని మానసిక సంఘర్షణయే కాని సామాజిక స్పృహతో చేసిన సంఘర్షణ అని ఒప్పుకోవాలనిపించదు.
ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయం నేను ఎదిగే కొద్దీ మారవచ్చు అనే కంటే ఎదగవచ్చు అని ఆశిస్తున్నాను. నాకు చలం మైదానం వంటి నవలలు చదవడం చాలా కష్టం. సాంఘిక ఇతివృత్తంతో రాసిన నవలలేమైనా చదవగలనేమో, ఎక్కువ పాత్రలూ, వైవిధ్యమైన సన్నివేశాలూ కలిగినవి ఐతే. బహుశా బ్రాహ్మణీకం ఆ కోవలోకి వస్తుందేమో. తీర్చలేని కష్టాలు, అన్యాయంగానో అమాయకత్వంతోనో బలి అయ్యిపోయే పాత్రల గురించి చదవడం కూడా కష్టమే ఐనా.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-14105867544397070362011-06-03T19:11:13.868+05:302011-06-03T19:11:13.868+05:30నేను బ్రాహ్మణీకం నవల చదవడానికి ముందు వార్త ఆదివారం...నేను బ్రాహ్మణీకం నవల చదవడానికి ముందు వార్త ఆదివారం బుక్లెట్లో రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసాలు చదివాను. రంగనాయకమ్మ గారు చలం రచనలలోని స్త్రీల పాత్రలకీ, విశ్వనాథ & బాపిరాజుల రచనలలోని స్త్రీల పాత్రలకీ మధ్య తేడాని చక్కగా వివరించారు. అది చదివిన తరువాతే నాకు బ్రాహ్మణీకం & అనసూయ రచనల పై ఆసక్తి పెరిగింది. దాని గురించి ఇక్కడ వ్రాసాను http://literature.mlmedia.net.in/2010/03/blog-post_2392.htmlPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-78078079545602965762011-06-03T18:36:33.658+05:302011-06-03T18:36:33.658+05:30ప్రవీణ్గారూ,
ఇది రాసే ముందే బ్రాహ్మణీకం మీద మీరు...ప్రవీణ్గారూ,

ఇది రాసే ముందే బ్రాహ్మణీకం మీద మీరు రాసింది చదివాను. కృతజ్ఞతలు. మిగిలినవి చదివి అభిప్రాయలు పంచుకుంటాను.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-27191531144045745902011-06-03T18:35:30.874+05:302011-06-03T18:35:30.874+05:30సుజాత గారూ,
మీ స్పందనలో మరో సారి చలం ఎందుకు స్త్రీ...సుజాత గారూ,
మీ స్పందనలో మరో సారి చలం ఎందుకు స్త్రీలకు ప్రత్యేకమయ్యాడో ..ఆడవాళ్ళల్లో చాలా మందివి బహుశా ఇవే భావాలేమో! మీరు ఉదహరించిన "ఆచారాలకు" సంబంధించిన మాటలు చదివినప్పుడు నాకూ అలానే అనిపించింది.

చలం పుస్తకాలు నాకు కొత్త. ముందే చెప్పినట్టు వాటిలోని బాధ నన్ను వాటికి ఇన్నాళ్ళూ దూరంగా ఉంచింది. మొన్నీ మధ్య భాస్కర్ గారు పుస్తకాలు పంపించడంతో అదే పని మీద ఉన్నాను :))Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-68277843213271559082011-06-03T17:56:31.594+05:302011-06-03T17:56:31.594+05:30ఆ మధ్య ఎవరో అడిగారు, చలం గారి నవలలలో స్త్రీలు చివర...ఆ మధ్య ఎవరో అడిగారు, చలం గారి నవలలలో స్త్రీలు చివరలో ఆత్మహత్యలు చేసుకుంటారు లేదా విషాదంలో మిగిలిపోతారు ఎందుకు? అని. అప్పట్లో స్త్రీలకి సమాజం విధించిన కట్టుబాట్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది కాదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-6201335001817068332011-06-03T17:51:21.844+05:302011-06-03T17:51:21.844+05:30అనసూయ పాత్ర సుందరమ్మ పాత్ర వంటిది కాదా? భర్త చనిపో...అనసూయ పాత్ర సుందరమ్మ పాత్ర వంటిది కాదా? భర్త చనిపోయిన అనసూయకి రెండవ పెళ్ళి చెయ్యకుండా ఆమె భర్త ఆస్తి కోసం ఆమెని విధవగా ఉంచుతారు. ఆమెకి బంధువుల అబ్బాయి సూర్యనారాయణని దత్తత ఇచ్చి ఆస్తి పోకుండా చేస్తారు. ఆ సమయంలో అనసూయ ఒక డాక్టర్ని నమ్మి మోసపోతుంది. ఇంటి నుంచి పారిపోయి డాక్టర్ని పెళ్ళి చేసుకోవాలనుకున్న ఆమెని డాక్టర్ మోసం చెయ్యడంతో ఆత్మహత్య చేసుకుంటుంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-45952013850341463432011-06-03T17:39:27.363+05:302011-06-03T17:39:27.363+05:30ఈ కథ ఎన్ని సార్లు చదివినా అప్పుడే మొదటి సారి చదివి...ఈ కథ ఎన్ని సార్లు చదివినా అప్పుడే మొదటి సారి చదివినట్టు నిస్సహాయతతో కన్నీళ్ళు వస్తాయి నాకు! సుందరమ్మకి కొంచెం కూడా సహాయం చేయలేకపోయామే, "ఓసి పిచ్చి కుంకా, వాడి ఉద్దేశం గమనించు" అని కాస్తయినా జాగ్రత్తలు చెప్పలేకపోయామే అని పిచ్చి దు@ఖమొస్తుంది.

చలానికి స్త్రీ అర్థమైనట్టు మరే స్త్రీ కైనా అర్థం అవుతుందా అన్నది, నాకిప్పటికీ సందేహమే! వాళ్ళకు మాత్రమే సొంతమైన కొన్ని భయాలు, ఆలోచనలు, అభద్రతా భావాలు, సంశయాలు, ఎక్కడా ఎప్పుడూ ఎవ్వరి ముందూ బయపెట్టని ఆశలు చలం అక్షరీకరించినట్లు వేరొకరు చేయలేరు. తమకు మాత్రమే తెలుసుననుకున్న కొన్ని రహస్యాలు చలం ఇలా బట్టబయలు చేస్తుంటే, చలాన్ని చదివే ఆడవారందరూ ఆశ్చర్యంతోనో, ఇన్ని తెలుసుకునేందుకు అతని దగ్గరున్న మంత్రమేమిటన్న అనుమానంతోనో అతడికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారనుకుంటా, నాలాగా! __________ఇవి అచ్చంగా నా మాటలే! చలం పుస్తకాలు చదివినపుడల్లా నా మనసులో నేను గొణుక్కునే మాటలు! చాలా మంది ఇలాగే అనుకుంటారేమో అయితే! అవును, మన మన్సులో ఆలోచనల్నీ రహస్యాలనూ చలం ఎలా తెలుసుకోగలడో తెలుసుకునేందుకే స్త్రీలు చలానికి దగ్గరవుతారు.

ఇలా తీయని మాటలకు,ప్రేమ ప్రకటనలకు లొంగి పోవడంలో ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు ఆడవాళ్ళలో!

ఇందులో చలం ఒక మాట అంటాడు ఒక చోట "ఔన్నత్యంలో ఉన్నన్నాళ్ళూ మనుషులు ఆ ఔన్నత్యం తమ స్వభావంలోనే ఉందనుకుంటారు" అని! సుందరమ్మనుద్దేశించి! ఎంత అద్భుతమైన మాటో!

అలాగే ఆచారాలన్నీ తు చ తప్పకుండా పాటించే సుందరమ్మ మేనమామ ఇంట్లో కాఫీ కి అలవాటు పడ్డప్పుడు "సుందరమ్మ ఆచారమంతా అలవాటే గానీ ప్రిన్సిపుల్ కాదు" అంటాడు. చాలా మందికి ఛెళ్ళున తగిలే మాట అది.

సుందరమ్మ మాత్రం చలం పాత్రల్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర! చాలా జాలినీ ప్రేమనూ కల్గించే పాత్రసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-53033267809218300392011-06-03T16:48:49.472+05:302011-06-03T16:48:49.472+05:30చలం గారు వ్రాసిన అనసూయ కూడా చదవండి. బ్రిటిష్వాళ్ళ...చలం గారు వ్రాసిన అనసూయ కూడా చదవండి. బ్రిటిష్వాళ్ళ కాలంలో భర్త చనిపోయిన స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో తెలుస్తుంది. 'అనసూయ'లో జరిగినవి పూర్వం మా కుటుంబంలో కూడా జరిగాయి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2312195244229149020.post-12928732622803992132011-06-03T16:33:15.847+05:302011-06-03T16:33:15.847+05:30ఆ మధ్య రంగనాయకమ్మ గారు వార్త ఆదివారం బుక్లెట్లో ...ఆ మధ్య రంగనాయకమ్మ గారు వార్త ఆదివారం బుక్లెట్లో చలం నవలావలోకనం పేరుతో రివ్యూలు వ్రాసారు. ఆ రివ్యూ చదివిన తరువాతే నేను బ్రాహ్మణీకం నవల చదివాను.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com