Posts

Showing posts from March, 2018

అమృతసంతానం - గోపీనాథ మహాంతి

బెజవాడ బెంజ్‌సర్కిల్ దగ్గర్లో, రోడ్డు మీదకే ఉండే అపార్ట్మెంట్‌లో, ఒక చిన్న ఫ్లాట్ మాది. వెనుక వైపు ఖాళీగా ఉండే ఐ.టి.ఐ కాలేజీ గ్రౌండులో పద్ధతి లేకుండా అల్లుకుపోయే పిచ్చి చెట్లూ, దూరంగా కనపడే గుణదల కొండా, ఆ కొండ మీద మిణుకుమిణుకుమనే దీపమూ, పాలిటెక్నిక్ కాలేజీ గుబురు చెట్ల మీంచీ సూర్యుడూ చంద్రుడూ ఆకాశం పైకి ఎగబాకుతూ వచ్చే దృశ్యమూ - ఇదే నేను చూసిన ప్రపంచమూ, ప్రకృతీ. ఊరెళుతూ వెళుతూ పక్కవాళ్ళకి తాళాలిచ్చి నీళ్ళు పోయించుకు కాపాడుకునే తులసీ, గులాబీ మొక్కలు తప్ప, ఆ ఎర్రటి కుండీల్లోని నాలుగు గుప్పిళ్ళ మట్టి తప్ప, బంకమన్నును బిగించిన అదృష్టరేఖలేవీ నా అరచేతుల్లో లేవు. అట్లాంటి ఈ ఖాళీ చేతుల్లోకి, పుష్యమాసపు చివరి దినాల ఎండని మోసుకొంటూ, అమృతసంతానం వరప్రసాదంలా వచ్చి పడింది. విచ్చుకున్న అడవి పూల మత్తుగాలిని మోసుకొచ్చింది. అడవి దేశపు వాసనలు చుట్టూ గుమ్మరించింది. గుమ్మటాల్లాంటి కొండల మధ్యలో నిలబెట్టి, 'ఎదటి కొండల మీద ఎండ కెరటాల్లా..' తేలిపోవడం చూపెట్టింది. కోఁదు గుడియాలను ఒరుసుకుంటూ పరుగెట్టే కొండవాగు పక్కన కూర్చుండబెట్టి పిల్లంగోళ్ళు వినిపించింది. చెవుల్లో డుంగుడుంగా గుబగుబలాడించింది. మామిడి ట…

కడుపు నిండిన మధ్యాహ్నమొకటి..

ఆఫీసులో pantry వైపుకు వెళితే, అక్కడ కొంచం పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు housekeeping staff ఎప్పుడూ ఏవో పనులు చేసుకుంటూ కనపడుతూనే ఉంటారు. తెలుగువాళ్ళు మొహాలను చూసే ఒకరినొకరు గుర్తుపడతారనుకుంటాను. ఒకావిడ నన్నెప్పుడూ టైం ఎంతయింది మేడం ..అని పలకరిస్తూ ఉంటుంది. భోజనం చేశారా, టైం ఎంత - ఈ రెండే ఆవిడ ప్రశ్నలు. చక్కగా స్టెప్స్ వేసి కట్టుకునే సిల్కు చీరలతో, ముడితో, పెద్ద బొట్టుతో..బాగుంటుంది. ఈ రోజు లంచ్ టైంలో ఇక వెళ్దాం అనుకుంటూండగా పది నిముషాల్లో జాయిన్ అవ్వాలి అంటూ meeting invite ఒకటి వచ్చింది. కాదనలేనిది, ముందువెనుకలకు జరపలేనిది. తప్పదురా దేవుడా అనుకుంటూ, అప్పుడే ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ pantry వైపుకి వెళ్ళిపోయాను. ఆవిడ ఉన్నారు, ఎప్పటిలాగే, నవ్వు మొహంతో. పక్కకు ఒద్దికగా జరిగి నిలబడి, కొట్టొచ్చినట్టు కనపడే ఆకుపచ్చ నాప్‌కిన్‌తో కాఫీ మగ్స్ తుడుస్తూ. నేను మాట్లాడాల్సిన నాలుగు ముక్కలూ మాట్లాడి, - ఇక మీటింగ్ ఉందనీ, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు లంచ్ కి బయటకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాననీ చెప్పి - పెట్టేశాను. హడావుడిగా అక్కడున్న బిస్కట్స్ తీసుకుని, వాటర్‌బాటిల్ నింపుకుని వెనక్కి రాబోతుంటే, వెనుక నుండి "ప్చ…

తొట్ట తొలి హీరో!

JustBake మా ఇంటి దగ్గర్లో..నాలుగు అడుగుల దూరంలో ఉంటుంది. కొన్నాళ్ళ క్రిందట, అక్కడ ఒక కేక్ తీసుకోవడానికి వెళ్ళాను. అనిల్ కోసం. ఆగస్టు పదిహేనున కూడా అపార్ట్మెంట్‌లలో కేకులు చిన్నపిల్లల కోసం కట్ చేయించడం తెలుసు నాకు. బహుశా అందుకేమో, చాలా రద్దీగా ఉంది. ఆర్డర్లు తీసుకుంటూ కౌంటర్‌లో వాళ్ళు కూడా హడావుడిగా ఉన్నారు. నా పక్కనే పొట్టి నిక్కరొకటి వేసుకుని, మెడ పైకి కత్తిరించిన జుట్టుతో ఉన్న ఒకమ్మాయి, వంగి వంగి అద్దాల పైకి ముక్కు పెట్టి అన్ని కేకులూ చూసుకుంటోంది. "ఇదెంత?" ప్రతి దాన్నీ చూపించి అడుగుతోంది. KG అయితే? 1/2 KG చాలు? నాకు కేండిల్స్ అక్కర్లేదు. ఆ అమ్మాయి ప్రశ్నలు తెగట్లేదు. కౌంటర్ లో అబ్బాయి విసుగు లేకుండా సమాధానాలిస్తున్నాడు. మొత్తానికి ఆ నాజూకు చూపుడువేలు ఒకదాని మీద స్థిరపడింది. అరకేజీ చాలని చెప్పింది. 15 వ తారీఖు రాత్రికి వచ్చి తీసుకుంటాననీ, వచ్చేటప్పటికి ఏడవుతుందనీ - షాప్ మూసెయ్యద్దనీ చెప్తోంది. నేను తల తిప్పి నేరుగా ఆమెను చూడకుండానే వింటున్నాను అన్నీ. కౌంటర్ లో అబ్బాయి నా వైపు చూశాడు. అదే కేక్ నాకూ, అరకేజీనే కావాలనీ, నేను అదే టైంకీ వస్తాననీ చెప్పాను. అన్నీ రాసుకున్నాడు. &q…

ఏడు పుస్తకాల అట్టలు - నచ్చని ఆట- నాలుగు మాటలు

ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో నచ్చిన ఏడు పుస్తకాల అట్టలు పోస్ట్ చేయడమనే ఆట నడుస్తోంది. అక్కడా కాస్త కలుపుగోలుగా తిరిగే చదువరులకు ఆ ఆటా, వివరం తెలిసే ఉంటాయి కానీ, కొరుకుడుపడని ఆ ఆట గురించి నా నాలుగు మాటలూ.. *
అసలు పుస్తకాలకి ఒక్క లోపలి అక్షరాల వల్లేనా అంత అందమూ, ఆకర్షణా, ఆదరణానూ? పోనీ, అట్ట మీద బొమ్మల వల్లా? మనకిష్టమైన రచయిత మనకళ్ళ ముందే కొత్త పుస్తకాలు ప్రచురిస్తున్నా, అవే మునుపటి పుస్తకాల కన్నా అన్ని రకాలుగానూ ఉత్తమమైనవని మనకి తెలుస్తూనే ఉన్నా, ఆ పాత పుస్తకాల అట్టలనే మళ్ళీ మళ్ళీ అతికించుకుంటూ, అట్టలేసుకుంటూ ఎందుకు భద్రంగా కాపాడుకుంటాం? జీవనశకలమొకటి ఆ రంగుమార్చుకున్న కాగితాల మధ్యన చిక్కుబడిపోయి ఉందనీ, అది భద్రమైనన్నాళ్ళూ, మన పసితనమో, యవ్వనమో, మనమో, మన ప్రియమైనవాళ్ళో భద్రమనీ, లోలోపల మనకొక నమ్మకం. ఏవీ అర్థమవ్వని పుస్తకాలుంటాయి, అయినా అవి మన పుస్తకాల అరల్లో కళ్ళకెదురుగా కనపడడం మానవు. అవి అర్థమవ్వడం కాదు మనకు ముఖ్యం, అవి మనవిగా ఉండటం. మనని జీవితకాలమంతా అంటిపెట్టుకునే ఉండటం. ఒకే పుస్తకం పది ప్రచురణలకు నోచుకుంటుంది. బ్రతికున్న రచయితలైతే తప్పులొప్పుకుని దిద్దుకుని మరీ ప్రచురిస్తారు. మనకి సంబంధం ఉండ…

సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ

ప్రస్తుతం విమర్శ అన్న పదాన్ని మనం criticism– ఒక సృజనను విశ్లేషించి మంచిచెడ్డలు ఎంచడం– అన్న అర్థంలో వాడుతున్నాం. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల ఆంగ్లేయుల పాలన తరువాత మనం కొత్తగా అలవాటు చేసుకున్నది. అంతకు ముందు మనం విమర్శ అన్న పదాన్ని ఈ అర్థంలో వాడలేదు. పూర్వకవులు ఒక రచనను సవిస్తరంగా పరిశీలించి, వివరించి చెప్తూ వ్యాఖ్య అని రాసేవారు. (ఉదా: మల్లినాథసూరి వ్యాఖ్యలు) ఇప్పుడు మనకున్న ఈ critical evaluation అన్న విమర్శ పద్ధతి మనకు మొదటినుంచీ అలవాటైన పద్ధతి కాదు. ప్రస్తుతం తెలుగు సాహిత్యరంగంలో విమర్శ కనిపించటం లేదు అని తరచూ వినపడుతున్న మాటకు కారణాలు ఆలోచిస్తే– తమ విద్వత్ప్రతిభలపై విశ్వాసం హద్దులు దాటి వున్న రచయితలు పొగడ్తలు మినహా మరేమీ తీసుకోలేకపోవడం మొదలుకుని, సాహిత్యేతరకారణాలు, స్పర్థలు, విభేదాల వల్ల కావ్యవిమర్శను కవివిమర్శగా దూషణలతో అలంకరించి, తమ అభిప్రాయాలను సాహిత్యసత్యాలుగా ప్రకటించి విమర్శ అన్న పదానికి చెడ్డపేరు తెచ్చిన విశ్లేషకులు, వ్యాఖ్యాతల వరకూ- ఎన్నో కనపడతాయి. కారణాలేమైనా, విమర్శ అన్న పదానికి తప్పులెన్నడం అన్న అర్థం ఇటీవలి కాలంలో స్థిరపడిపోయింది కానీ నిజానికి విమర్శ అన్నది సునిశితమైన పరి…

కిటికి లోపల వెన్నెల

Image
రోజూ తినే వేళకే భోజనానికి పిలుస్తూంటే, చిత్రహార్ రోజుల్లో మాత్రం, అక్కా-నేనూ ఇంకో అరగంట గడిస్తే బాగుండని తప్పించుకు తిరిగేవాళ్ళం. అప్పుడైతే, ఆ పాటలు చూస్తూ భోంచెయ్యచ్చని. అలాంటి చిత్రహార్ రోజుల్లోనే, ఓసారి చూశానతన్ని. ఓ అమ్మాయిని ఏదో వేడుకలో చూస్తూ, ఆమె తప్పిపోతే వెదుక్కుంటూ మథనపడిపోతూండగా చూశాను. అమ్మాయేమో సన్నజాజి మొగ్గ. తెల్లటి గాగ్రాలో అతన్ని తప్పించుకుంటూనో తెరచాటుగా చూస్తోనో, కలవరపడిపోతూంటుంది. రెండు చేతుల గాజుల మధ్యగా అతన్నే చూస్తూ దారి మరచి నిలబడిపోవడం, అతడక్కడి స్థంభాన్ని ఎక్కి కొట్టి వెనక్కు మళ్ళడం, తేనెలొలికిన ఆ గాత్రం... - "ఉరికే కసి వయసుకు శాంతం..శాంతం"..- చెవుల్లో ఎవరెన్ని సార్లు చెప్పినా వినపడని వయసు! ఎన్నడూ లేనిది ఆ రాత్రి అక్క నాతో సఖ్యంగా మాట్లాడింది. "ఆ అబ్బాయి పేరు అరవిందస్వామి" దుప్పటి ముఖం దాకా కప్పుకుని గుసగుసగా చెప్పింది. నేను ఆ చీకట్లోనే కళ్ళు పెద్దవి చేసి చూశాను. కథ చెప్పడం మొదలెట్టింది. బురఖా రేవు దగ్గర ఎగరడం, సైరాభాను మొహం మీదకి లాక్కోవడం, అది గాలికి మళ్ళీ ఎగరడం, మళ్ళీ లాక్కోవడం...వాళ్ళ నాన్న ముందే అతడా అమ్మాయి చేయి పట్టుకోవడం, మణికట్టు…