Posts

Showing posts from March, 2019

చంటిపిల్లల చేతుల్లో ఫోన్లు

ఫొటోల కోసం చంటిపిల్లల అమ్మలు ఆత్రపడరు. ఆత్రపడరు అంటే తీసుకోరు అని కాదు, తీసుకున్నవి చూసుకోలేరు, బయటి మనుష్యులతో పంచుకోలేరు. మేం ముగ్గురమే ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి గుర్తుగా ఉంటుందని ఒక ఫొటో తీయమని దారిన పోయే పుణ్యాత్ముడిని పిలిచి ఫోన్/కెమెరా వాళ్ళకిచ్చి ఫొటోలు తీయమని అడిగేప్పుడు, ఒకటికి నాలుగు సార్లు ఫోటోలు క్లిక్కుమనిపించండని చెప్పడం రివాజైపోయింది. అంతా చేసి, అందులో కొన్నింటిలో నా చూపుడు వేలు నా పిల్లాడిని కెమెరా వైపు చూడమని బతిమాలుతూ ఉంటుంది. అవెలాగూ blur అయిపోయి ఉంటాయి, దాచుకు చూసుకునేందుకు పనికిరావు. ఇంకొన్నింటిలో బుజ్జాయి మా వైపు తిరిగిపోయి ఇద్దరినీ ప్రశ్నలడుగుతూ ఉంటాడు - ఆ ఫలానా ఆంటీ/అక్క/అంకుల్/అన్నయ్య మన ఫోన్ ఎందుకు తీసుకున్నారని. మేమిద్దరం కెమెరా వైపు చూడ్డం మానేసి, మా వాడికి చరిత్ర విప్పి చెబుతూ ఉంటాం; 'మన ఫొటో తీయడానికే కన్నులూ, నువ్వు ఇలా 'ఈ..' అని నవ్వావంటే మన ఫోన్ మనకిచ్చేస్తారూ' అని. ఈ లోపే వాడు మా మాటలు గాలికొదిలేసి పరిసరాల్లో వాడు కొత్తగా మరిదేన్నో గమనించిన ఉత్సాహంలో చంకలోంచీ దూకబోతుంటే దొరకబుచ్చుకుని, '- పోనీ నువ్వు తీసుకో' అనో - 'ఇల…

అర్బన్ ప్రపంచాన్ని మోహరించిన కొత్త చూపు

Image
పూడూరి రాజిరెడ్డి గారి "రియాలిటీ చెక్" పుస్తకం గురించిన నా ఆలోచనలు కొన్ని..ఈవేళ్టి ఆంధ్రజ్యోతి- వివిధలో..

http://www.andhrajyothy.com/artical?SID=727585