నువ్వున్నట్టుండొక
మెరుపువై వణికినా
నే నిలువెల్లా జ్వలించి
ఒకే ఆలోచనై చలించినా
ఎంత అలజడి!
చినుకుల్లా కురిశాక
నీలోనూ,
కవిత్వమై కరిగాక
నాలోనూ..
ఆకాశమా!
తేలికపడ్డాక
ఎంత ప్రశాంతత.
రోజూ పొద్దున అందరి స్నానాలూ అయ్యాక ఏదో ఒక టైం చూసుకుని వాషింగ్ మెషీన్ వెయ్యడమూ, పొద్దుటి మీటింగ్ల హడావుడి, పిల్లాడి లాగిన్ అయ్యాక ఓ పది న...