Posts

Showing posts from July, 2014

సరే, గుర్తుచేయన్లే!

తొలిప్రచురణ -సారంగలో. గుర్తొస్తూంటాయెపుడూ,
వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో నువు పొగమంచులా ప్రవేశించి  నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు,
లేలేత పరువాల పరవళ్ళలో లయతప్పే స్పందనలను లాలించి ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు ,
లోతు తెలీని లోయల్లోకి మనం తమకంతో తరలిపోతూ మలినపడని మంత్రలోకాల్లో ఊగిసలాడిన క్షణాలు- 
నీకూ గుర్తొస్తాయా, ఎప్పుడైనా...
శబ్దాలు సిగ్గుపడే చీకట్లో అగణిత నక్షత్ర కాంతుల్ని నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు,
కలిసి నడచిన రాగాల తోటల్లో రాలిపడ్డ అనురాగపరాగాన్ని దోసిళ్ళతో గుండెలపై జల్లి నను గెల్చుకున్న త్రోవలు,
గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు -
సరే, గుర్తుచేయను. సరదాకైనా, నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను. పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.

కొండదారిలో...

ఆ దారి వెంట నడచిపోతోంటే
సూరీడి ఏటవాలు కిరణాలు
నీడలను నాట్యాలాడిస్తుంటాయి. గాలులు చేలో మొక్కలతో
అంటుకునే ఆట కాబోలు
అలసట లేకుండా ఆడుతూంటాయి. రెక్కలు చరుచుకుంటూ
పొగలా లేచిన పక్షుల గుంపొకటి
మబ్బుల్లోకి ఎగిరి మాయమౌతుంది. ఎవరో పేనిన ఊడల ఉయ్యాల
ఊగేందు కెవరూ రారేంటని
కొమ్మలను కుదిపేస్తుంటుంది. కొండదారిలో రాలిపడ్డ పూలగుత్తుల్నీ
కుబుసాలు విడుచుకుంటోన్న జంటసర్పాలనీ
జాగ్రత్తగానే దాటుకు ఇల్లు చేరతాను కానీ, ఆ గాలిలో నలిగిన పూలపరిమళమేదో
ఊపిరిలో చేరి వెంటాడటమాపదు.
కడవల్లో నీలాకాశాన్ని మోసుకుంటూ
వడివడిగా నడచిపోయిన ఆ
కొండయువతి కడియాల చప్పుడు
ఘల్లుమని ఈ గుండెల్లో
మోగడమాగదు!                                                                                              --------------------తొలి ప్రచురణ - ఈమాటలో.

చిన్నికృష్ణా..!

చెప్పవూ, ఎప్పుడువస్తావో! నీమీదబెంగతోనిద్రమరలిపోయింది. ఎర్రబారినకనులలోఆశమిణుకుమిణుకుమంటోంది. నలనల్లనిఉంగరాలముంగురులుపసివేళ్ళతోవెనక్కుతోసుకుంటూ, ధూళిధూసరితదేహంతోచిందాడుతూ, చెదరినముత్యాలహారాలతో, నడుముఒంపులోదోపినమోహనమురళితోపరుగుపరుగునవచ్చిఒడిలోవాలి, నాకన్నుల్లోకిచూసినవ్వేఆమాయామోహనమురళీధరుణ్ణిచూడాలనేఅహరహంనిరీక్షణ.
ఈరోజైనానువ్వొస్తావనో, లేదానిన్నుచూస్తాననోఆశేశ్వాసగాతెల్లవారుతుంది. తమాలవృక్షాలక్రిందనీడలుచిక్కనవుతూచీకటిలోకలిసిపోయేవేళ, ఈరాత్రీనిన్నుచూడకుండానేగడవాలన్నఆవేదనేఆలోచనలన్నింటా