కొండదారిలో...

ఆ దారి వెంట నడచిపోతోంటే
సూరీడి ఏటవాలు కిరణాలు
నీడలను నాట్యాలాడిస్తుంటాయి.
గాలులు చేలో మొక్కలతో
అంటుకునే ఆట కాబోలు
అలసట లేకుండా ఆడుతూంటాయి.
రెక్కలు చరుచుకుంటూ
పొగలా లేచిన పక్షుల గుంపొకటి
మబ్బుల్లోకి ఎగిరి మాయమౌతుంది.
ఎవరో పేనిన ఊడల ఉయ్యాల
ఊగేందు కెవరూ రారేంటని
కొమ్మలను కుదిపేస్తుంటుంది.
కొండదారిలో రాలిపడ్డ పూలగుత్తుల్నీ
కుబుసాలు విడుచుకుంటోన్న జంటసర్పాలనీ
జాగ్రత్తగానే దాటుకు ఇల్లు చేరతాను కానీ,
ఆ గాలిలో నలిగిన పూలపరిమళమేదో
ఊపిరిలో చేరి వెంటాడటమాపదు.
కడవల్లో నీలాకాశాన్ని మోసుకుంటూ
వడివడిగా నడచిపోయిన ఆ
కొండయువతి కడియాల చప్పుడు
ఘల్లుమని ఈ గుండెల్లో
మోగడమాగదు!                                                                                              --------------------                                                                                                 తొలి ప్రచురణ - ఈమాటలో.

10 comments:

 1. 5th stanza lo haTaattugaa tone maripOyinattayindi.. ayinaa nee maaTalu kadaa..baagunnai :)

  ReplyDelete
  Replies
  1. పాములు విడుచుకున్న కుబుసాలను చూశాకే ఆ దారి మీద ఆసక్తి కలిగిందండీ. అన్ని దృశ్యాలూ అచ్చంగా ఒకే దారిలోవి. నన్ను నెలరోజులకు పైగా విడవకపోతేనూ - ఇలా రాయాల్సి వచ్చింది ;). థాంక్యూ!

   Delete
 2. I mATaloa chadivanu akka... chaalaa baagundi:-):-)

  ReplyDelete
 3. నాగ శ్రీనివాస్‌గారూ, కార్తిక్ - ధన్యవాదాలు.

  ReplyDelete
 4. చాలా బావుందండీ. ఎందుకో ఇది చదువుతుంటే... అరకు లోయలో తిరిగిన ఓ జ్ఞాపకం మళ్లీ మనసులో మెదిలింది.
  ఈ కడియాల మాట చాలా రోజుల తర్వాత వింటం. మా అవ్వ (అమ్మమ్మ) రెెండు చేతులకు ఓ అయిదారు వెండి కడియాలు వేసుకునేది. చిన్నతనంలో మాకు కథలు చెబుతూ, ఆకూ-వక్కని కలిపి చిన్నిసైజులో లంకె వేసిన ఆకురాయి రోట్లో (పిడికెడంతే ఉండేవి, ఇవిప్పుడు కనిపించవు) మెత్తగా దంచి నోట్లో పెడుతుండేది, అప్పుడు వినేవాళ్లం ఆ కడియాల చప్పుడు. కాళ్లకు మాత్రం ఒక్కో కడియమే. నో చప్పుడు :-)))

  ReplyDelete
  Replies
  1. నాగరాజ్ గారూ- ధన్యవాదాలండీ! అరకు లోయ అని ఎందుకు అన్నారో తెలియదు కానీ, ఇది విజయనగరంలో ఓ కొండ దారిని చూసీ చూసీ ఆ దారితోనూ ఊరితోనూ ప్రేమలో పడి వ్రాసుకున్న కవిత. :)

   Delete
 5. బావుంది మానసా..

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...