Posts

Showing posts from 2015

సత్యశోధకుడు గాంధి

గాంధి అన్నది ఇప్పుడు మనలో చాలా మందికి అతి సామాన్యమైన పేరు. మనం వినీ వినీ చలించకుండా పోయిన పేరు. మన ఊరిలో ఏ ప్రత్యేకతా లేని ఓ వీధి పేరు. మనం నిర్లక్ష్యంగా పారేసే రూపాయి నోటు మీది బొమ్మ పేరు. ఓ భగత్సింగ్ పేరు వింటే వెన్ను నిటారుగా అయి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టు, గాంధి పేరు చెబితే ఎప్పుడూ నాలో స్పందన కలిగేది కాదు. భగత్‌సింగ్ తనకు ఉరిశిక్ష విధించబడిందని తెలిసిన రోజు “ ‘విప్లవమంటే భగత్‌సింగ్’ అని ప్రజలు నమ్ముతున్నారు. నేను ఇప్పుడు చనిపోకపోయినా జీవితకాలంలో ఏ క్షణమైనా సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజలు దానిని వ్యక్తికి ఆపాదించరు. విప్లవ సిద్ధాంతానికి ఆపాదించి నిరసిస్తారు. కొన్ని వేల గుండెల్లో స్పూర్తిని నింపుతున్నాననుకుంటూ, నవ్వుతూ మరణించగలను” అన్న మాటలను, పసితనంలో అమాయకత్వంతో కురిసిన కన్నీళ్ళతోనూ, యవ్వనంలో ఆవేశంతోనూ, అటుపైన ఆ మాటల్లోని లోతైన భావానికి చలించి కృతజ్ఞతతోనూ కొనియాడినట్టు, గాంధిని మనస్పూర్తిగా అభినందించిన క్షణాలు నా జీవితంలో లేనేలేవు… “సత్యశోధన” పుస్తకం నా చేతుల్లో పడేవరకూ. అది కూడా ఎప్పుడు? మన లోలోపలి పేరుపెట్టలేని వేదనో వెలితో లేదా సందిగ్దతో మనను నలిబిలి చేస్తూన్నప్…

వర్షం కురిసే రాత్రుల్లో..

చీకటిని వణికించే దీపకాంతిలో
అసహనంగా కదులుతాయ్ పరదాల నీడలు
ప్రాచీన స్వప్నాన్ని పదే పదే గుర్తు చేస్తూ
ఉండీ ఉండీ గలగలమంటాయ్ గాలిగంటలు

తెరిచిన కిటికీల్లోంచీ చాచిన నా అరచేతుల్లో
చిందులేస్తున్న చినుకుల్ని చూస్తూ చూస్తూనే
నే తిరగబడ్డ గొడుగుల్లో
పసివాడు వదిలిన పడవనవుతాను
వాడి పగడపు పెదవుల మీది నవ్వునై తుళ్ళిపడతాను

చుక్కల్ని దాచేస్తూ రెమ్మల్ని రాల్చేస్తూ
దిక్కుల్ని కాల్చేసే వాననలా చూస్తూ చూస్తూ
నే ముడుచుకున్న సీతాకోక రెక్కల్లో
దాగిపోని రంగుల లోకమవుతాను
దాగలేని  స్వేచ్ఛా కాంక్షనవుతాను

మంత్రజలం చల్లేదెవరో
తెలియరాదు కానీ
వర్షం కురిసిన ప్రతి రాత్రీ నేను
నేలను తాకని చినుకునవుతాను.

(Published in TFAS Souvenir-2015)

మహాలయం

ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం ఎవరి జీవితాల్లోని ఉత్సవ కోలాహలాన్నో
ఉరుకులు పరుగులతో మోసుకొస్తుంది గాలి
నల్లని రాత్రిని కన్నుల్లోకి ఒంపుకుంటూ
ఒంటరిగానే గాలిని నమ్మి నడచిపోతూంటాను అడవి పక్షుల పాటలన్నీ పగటినీడలతో పారిపోయే వేళ
శరదృతునదులన్నీ సముద్రంతో సంగమించే చోట
నిశినీలి చెంపలపై నక్షత్రాలు కైపుగా నవ్వి
నిదురపోని లోకాలపై మెరుపుకలలు రువ్వే వేళ
వాళ్ళని చూస్తాను కాగడా వెలుగుల్లో, కాళ్ళకు గజ్జెల్తో
జన్మాంతర దుఃఖాల్ని హేలగా
మంటల్లో విసిరే నిర్లక్ష్యంతో
యవ్వనంతో చంద్రుని ఆవరించే ఎర్రని వెలుగులా వాళ్ళంతా
చితిమంట చుట్టూ చేరి చిందేస్తుంటే చూస్తాను
లోకాలు కంపించటమొక్కటే లక్ష్యంగా ఆ
చేతుల్లోని మంత్రదండాలు ఊగిపోవడం చూస్తాను. ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం ఆ రాత్రి,
ముక్కలయే కాలం ముందు
మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి,
చీకటిని శ్వాసిస్తున్న లోకంలోనే
వెలుగేదో సుస్పష్టంగా కనపడ్డ రాత్రి ఆ అడవి మంటల్లో, అవనీ ఆకాశాల్లో
సముద్రపు గాలిలో, నీటిలో
నిరంతరం మెదలే అనాది సంగీతమే
అనాగరికుల వాయిద్యాల్లో ప్రతిధ్వనించి లోలోపలి సంచలనాన్ని శకలంలా ఎగరగొడుతోంటే
చుట్టూ ప్రతీ శబ్దమూ నిశబ్దమవడమూ
మహానిశబ్దమంతా సంగీతమవడమూ తెల…

శ్రీ

"మెలికలు తిరిగే నది నడకలకూ, మరి మరి ఉరికే మది తలపులకూ.." అలుపన్నదే ఉండదని, భలే 'లయ'గా చెప్పి ఒప్పించాడే అనుకున్నాను కానీ, అతని పేరేమిటో నాకప్పుడు తెలీదు. "ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసూ.." అని ఊగుతూ తూగుతూ పాడుకున్న మా యవ్వనం మీద అతని సంతకం పడుతోందనీ ఏమంత శ్రద్ధగా గమనించుకోలేదు. "ఔననా..కాదనా...అతనేదో అన్నాడూ" అనిపించే తొలిప్రేమ తడబాటునీ, "వీచే గాలి నీ ఊసులై తాకుతూ ఉంటే..దూరం దిగులుపడదా నిన్ను దాచలేననీ" అని అదే హృదయం నమ్మకంగా పలికి, "ప్రతీ శ్వాసలో ఉయ్యాలూగు నా పంచ ప్రాణాలు నీవే సుమా" అంటూ తీర్మానించడాన్నీ - మా మాటలు కాకపోయినా పాటలుగా పాడుకున్న క్షణాలు నిన్నా మొన్నా జరిగినంత స్పష్టంగానూ గుర్తు. "అమ్మ కొంగులో చంటి పాపలా...మబ్బు చాటునే ఉంటే ఎలా?" అంటూ కవ్వించి వెండివెన్నెలను నేలకు దించి, ప్రణయ ఝంఝలో కంపించే చిగురుటాకు లాంటి మనసుని ఏడంటే ఏడే స్వరాలతో లాలించి ఊరడించిన శ్రీని - ఈ పాటల్తోనే గుర్తుంచుకుంటానెప్పటికీ..!

జాషువా కవిత్వం - పిరదౌసి

కళ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది దాని జీవలక్షణం. సాహిత్యం దానికి మినహాయింపు కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథన కవిత్వ రీతులు పుట్టుకొస్తున్నాయి. నూతన అభివ్యక్తి మార్గాల కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. కవితా వస్తువులు మారుతున్నాయి, నేపథ్యాలూ కొత్తగా కనపడుతున్నాయి. కవిత్వ లక్షణాల గురించీ, లక్ష్యాల గురించీ విభిన్న వాదనలు వినపడటమూ, సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాలు ఏ కాలానికాకాలం కవిత్వాన్నీ ప్రభావితం చేయడమూ పాఠకలోకం గమనిస్తూనే ఉంది. ఇన్ని వైవిధ్యాలున్న వాతావరణంలో, ఎవరైనా ఒక కోవకు చెందిన కవిత్వాన్ని లేదా ఒకరి కవిత్వాన్ని మాత్రమే గొప్పది అనడం సాహసమనిపిస్తుంది. ఆ రకమైన అభిప్రాయం తాత్కాలికమనీ తోస్తుంది. సృజన గొప్పతనాన్ని నిర్ణయించగలిగేది కేవలం కాలం మాత్రమే. జాషువా ఖండకావ్యం పిరదౌసి, కాలం ధాటికి తట్టుకుని నిలబడ్డ అలాంటి అసాధారణమైన కవిత్వం. సరళమైన అభివ్యక్తితో గాఢమైన మానసిక దశలను చిత్రించిన తీరుకి, ఊహలకందని ఉద్వేగాలకి అక్షరరూపమిచ్చి అనుభవైకవేద్యం చేసిన సమర్థతకీ, ఇప్పుడే కాదు, ఏ కాలానికైనా ఈ కావ్యం సజీవంగా సాహిత్య లోకంలో నిలబడగలదు. పిరదౌసి పర్షియనులు ఎంతగానో అభిమానించే 10వ శతాబ్దపు ఒక గ…

నిర్ణయం

ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి
లేతపచ్చ ప్రాయంలో తన కోమలమైన స్పర్శని
కలనైనా ఊహించి అనుభవించలేనివాడివి
తొందరపడి తీర్పులివ్వకు, తననేమీ అనకు. మలుపు మలుపులో
ఎందుకు ప్రాణాన్ని మెలిపెట్టుకుందో
ఉప్పునీట కలిసే ముందు
ఏమని మనసును ఒప్పించుకుందో
పడవ కుదురుగా పాడుతున్నప్పుడు
ప్రయాణం చేసి పోయినవాడివి
లోతులు తెలియకుండా
నువ్వే నిర్ణయానికీ రాకు, దోషివి కాకు. నన్ను గిచ్చి లేపిన ఉదయమే
నీ వెన్నెల రాత్రవ్వడాన్ని
రెప్పవేయకుండా చూస్తోందే ఆ ఆకాశం
నిజం కూడా అబద్దమవుతుందంటే,
ముగింపుల్లోనే కథ మొదలవుతుందంటే
రాలిపడుతుందా? రంగులు మార్చుకుంటుందా? ఏ కాలం నాటిదో
ఎవరెందుకు వాడి వదిలేసిందో
నువు లోలోపల దాచుకున్న
ఇనుప తక్కెడ.
బరువెత్తిపోయిన రోజైనా
బయటకు తీసి చూడు.
వీలైతే విరిచి ముక్కలు చేసి
ఒక్కరోజైనా బ్రతికి చూడు. తొలి ప్రచురణ : ఈమాటజనవరి, 2015

ప్రయాణం

కొంత హుషారు కొంత కంగారు కొత్త స్టేషన్లో ఎప్పుడాగినా ఎంతోకొంత కలవరం
అమ్మడాన్నీ అమ్ముడుపోవడాన్నీ ఆగిన ఆ కాసిన్ని క్షణాల్లోనే ఎన్నో కొన్ని అప్పగింతల్నీ తప్పదు, ముగించుకోవాలి, లోకాన్ని నమ్ముతూ నమ్మిస్తూ లేదా నటిస్తూ
కళ్ళల్లో తేలే ఆశనిరాశల్నీ కౌగిళ్ళలో నొక్కుకునే బాధల్నీ అరుదుగా కొన్ని సంతోషాల్ని కూడా, చూస్తూనే కదలాలి బండి, తప్పదు, ఉద్వేగాలను గెలుస్తూ భరిస్తూ లేదా వదిలేస్తూ
చెట్లు పుట్టలు వెనక్కి మనుషులూ మమతలూ వెనక్కి ఒక జీవితమో జ్ఞాపకమో వెనక్కి వెళ్ళిపోయేవాడికి ఏవీ కనపడవు చివరికి ఇవేవీ మిగలవు గుర్తుకి. తొలి ప్రచురణ : వాకిలి,  జనవరి, 2015 సంచిక

సాంధ్యరాగం

రోజూ సాయంకాలం ఆఫీసు గేటు దగ్గరికి రాగానే కొన్ని వందల పక్షుల కువకువలు వినపడతాయ్. పగటి అలసటంతా చిరాగ్గా మారబోయే క్షణాలవి. ఆ వేళప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు, ఆఫీసు బస్సు అందుకోవాలని దాదాపుగా పరుగెడుతూ కూడా, ఆ గుబురు చెట్లు దాటే అరనిముషం సేపూ ఆ కోలాహలాన్ని వినడం, నావరకూ నాకో టానిక్ లాంటిది. అన్ని వందల పక్షులక్కడలా చేరి కిచకిచమంటుంటే రొద అనిపించదు. విసుగనిపించదు. అక్కడేదో పెద్ద ఉత్సవం జరుగుతున్నట్టూ, చిన్నప్పుడెప్పుడో వదిలిపోయిన నేస్తాలందరూ ఓ గూటి క్రిందకు చేరి పట్టరాని ఆనందంతో కబుర్లాడుకుంటున్నట్టూ - సంబరంలానే ఉంటుందసలు.

ఎవరికైనా సరే, ఇంటికి వెళ్ళీ వెళ్ళగానే - సొంతగూటికి - అంత అల్లరీ సందడీ ఉంటే ఎంత బాగుంటుంది?! పెళ్ళైన కొత్తలో మా అత్తగారు పిలిచి, "మావాడికి కుక్కపిల్ల పెంచుకోవాలని ఏనాటి నుండో కోరికమ్మా, ఇంటికి రాగానే అది మీదమీదకొచ్చి ముద్దులాడడం, చుట్టూచుట్టూ తిరగడం ఇష్టమట, సరదాల మాటకేం గానీ ఆ చాకిరీ నావల్ల కాదని పడనివ్వలేదు..నిన్నూ విసిగిస్తాడెప్పుడో..ఇష్టమేనా అని. ఏం చెప్తావో మరి" అంటూ ఓ ముందస్తు హెచ్చరిక జారీ చేయగానే నా గుండెల్లో బండరాయి పడింది. ఇలా ఎవరైనా పెట్స్ అంటే ఇష్టమేనా…