ప్రయాణం

కొంత హుషారు
కొంత కంగారు
కొత్త స్టేషన్లో ఎప్పుడాగినా
ఎంతోకొంత కలవరం

అమ్మడాన్నీ అమ్ముడుపోవడాన్నీ
ఆగిన ఆ కాసిన్ని క్షణాల్లోనే
ఎన్నో కొన్ని అప్పగింతల్నీ
తప్పదు, ముగించుకోవాలి,
లోకాన్ని నమ్ముతూ నమ్మిస్తూ లేదా
నటిస్తూ

కళ్ళల్లో తేలే ఆశనిరాశల్నీ
కౌగిళ్ళలో నొక్కుకునే బాధల్నీ
అరుదుగా కొన్ని సంతోషాల్ని కూడా,
చూస్తూనే కదలాలి బండి, తప్పదు,
ఉద్వేగాలను గెలుస్తూ భరిస్తూ లేదా
వదిలేస్తూ

చెట్లు పుట్టలు వెనక్కి
మనుషులూ మమతలూ వెనక్కి
ఒక జీవితమో జ్ఞాపకమో వెనక్కి
వెళ్ళిపోయేవాడికి
ఏవీ కనపడవు చివరికి
ఇవేవీ మిగలవు గుర్తుకి.
తొలి ప్రచురణ : వాకిలి
జనవరి, 2015 సంచిక

2 comments:

  1. వెళ్ళిపోయేవాడికి...ఏవీ కనపడవు చివరికి...ఇవేవీ మిగలవు గుర్తుకి.....Chala bavundi Chamarthi Manasa garu....just for Continuity...naa bhaavana Aksharaalalo chudandi...mee kavithalo chivari 3 Lines Inspiration tho....జీవితం... మనకు తెలిసినంత వరకే....
    గతం పెరిగిపోతూ వుంటుంది.....
    వర్తమానం తరిగిపోతుంటుంది.
    ప్రస్తుత క్షణం మరో క్షణానికి విగతమవుతుంది.
    తెలియని మృత్యువు... తెలివిని పోగొడుతుంది.
    ప్రాణం... విశాల గగనంలోకి విసిరి వేయబడుతుంది. - - - - 'సాహితీ శశి' అంతరంగం......Dhanyavaadaalatho...Sivakumar Ivatury

    ReplyDelete
  2. చాలా బాగా విశ్లేషించారు........ బాగుంది

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....