Posts

Showing posts from April, 2017

అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర

Image
మనకు మన దేశంలోని ఇతర రాష్ట్రాల కవుల కన్నా, ఇతర దేశాల్లో ఉన్న కవులే మెరుగ్గా తెలుసేమోనని చాలా సార్లు అనిపిస్తుంది. ఎక్కడో ఒక ఠాగూర్‌నీ సుబ్రహ్మణ్యభారతినీ కమలాదాస్ (మాధవి కుట్టి) లాంటి వారిని మినహాయిస్తే, ఇతర రాష్ట్రాల కవుల గురించి, వారి కవిత్వాన్ని గురించి, మనం విన్నదీ అక్కున చేర్చుకున్నదీ తక్కువ. మరీ ముఖ్యంగా, సమకాలీన కవిత్వానికి సంబంధించి, వైరముత్తు (A Drop in search of the Ocean, ఆంగ్లానువాదం: బాలన్ మీనన్), గుల్జార్ (Selected Poems, Neglected Poems, ఆంగ్లానువాదం: పవన్ కె. వర్మ), జావేద్ అఖ్తర్(In Other Words, ఆంగ్లానువాదం: అలీ హుసేన్) మొదలైనవారి కవిత్వాలు జనాల్లోకి వచ్చాయన్న మాటే కాని, అక్కడ కవిత్వాన్ని మించి లేదా కవిత్వంతో పాటుగా సినిమా మంత్రం పనిచేసిందనడం అతిశయోక్తి కాదు. మంచి కవిత్వమంటే మనకు బాగా తెలిసిన ప్రపంచాన్నే కొత్తగా చూపించడమో, లేదా అసలెన్నడూ చూడని లోకానికి తలుపు తీయడమో చెయ్యాలని నేననుకుంటాను. ఇతర దేశాల కవులనూ వాళ్ళ కవిత్వాలనూ చదువుతున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనకు తెలియని లోకాన్నే చూస్తాం. వాళ్ళ సిద్ధాంతాలు వేరు. సంస్కృతీసంప్రదాయాలు వేరు. ఆ లోకపు తత్వాలూ భావాలూ, వాళ్ళ…