Posts

Showing posts from January, 2016

"నెమరేసిన మెమరీస్" - ముళ్ళపూడి శ్రీదేవి

Image
సాధారణంగా గొప్ప వారి ఆత్మకథలు స్ఫూర్తి నిస్తాయనీ, తెలియని కబుర్లేవో చెబుతాయని ఆ పుస్తకాలు కొంటూంటాం. కొన్నిసార్లు వాళ్ళ కథలు చదివాకే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం, లేదా మునుపటి కంటే ఎక్కువగా ఇష్టపడతాం. ఉదాహరణకు ఆచంట జానకీరాం గారి "స్మృతి పథం" పుస్తకం తీసుకుంటే, ఆయనెవరో ఏమిటో నాకు మునుపు తెలియదు. అయితేనేం, ఆ పుస్తకమంతా ఆవరించి ఉన్న ఒకానొక సౌందర్య స్పృహ, ఆయన్ను పుస్తకం ముగించే వేళకి ఆప్తుణ్ణి చేసింది. తన కవిత్వంలో ఆయన పలికించిన ఉద్వేగాలూ, జీవితమంతా కవులతోనూ, కళాకారులతోనూ గడుపుతూ ఆ క్షణాలను గురించి పారవశ్యంతో చెప్పుకుపోయిన తీరు, నన్నూ ఆ కాలానికి తీసుకువెళ్ళాయి. అలాగే, దువ్వూరి వారు. ఆయన కథ చదువుతున్నా అలాగే విస్మయం. మనది కాని ఓ కాలంలోకి వీరంతా వేలు పట్టుకు భద్రంగా నడిపించుకు వెళతారు. మనవి కాని అనుభవాలు కొన్నింటిని మనసులో ముద్ర వేసి పోతారు. ఇటువంటివి కాక, సత్యసోధనో, ఓ విజేత ఆత్మకథో చదివినప్పుడు మనం పొందే స్ఫూర్తి వేరు. మన మనసు ఆలోచించే పద్ధతి వేరు. 
ఈ పుస్తకాలు సాధారణంగా బాగా పేరొందిన వారివే అయి ఉండటం చూస్తూంటాం. అలా కాకుండా, ఎవరో ఓ ఆరుగొలనులో పుట్టి పెరిగిన అమ్మాయి, జీవితం మూడొం…

విశ్వనాథ విద్వద్వైభవము

కొన్నాళ్ళ క్రితం మిత్రులు ఫణీంద్ర ఒక ఆంగ్ల వ్యాసాన్ని తెలుగులోకి తర్జమా చేయడంలో కొంత సాయం కావాలని అడిగారు. అందులో విశ్వనాథ కవిత్వ ప్రస్తావన ఉంది కనుక ఆ వ్యాసం నాకు కూడా కొంత ఆసక్తి కలిగించవచ్చునని చెప్పారు. ఆ పేరు వినగానే, సహజంగానే నేను ఆకర్షితురాలినయ్యాను. నాకు తప్పకుండా ఆ వ్యాసం పంపించవలసిందనీ, అనువాదం నేను చేయలేకపోయినా ఊరికే చూసేందుకు, చదివేందుకు అనుమతినీయవలసిందనీ కోరాను. అలా ఇద్దరం కలిసి, ఆ వ్యాసంలో ప్రస్తావించిన కవిత్వ ధోరణుల గురించి, విశ్వనాథ గురించి చెప్పిన విషయాల్లో సత్యాసత్యాల గురించి చర్చించుకుంటూ, అనుకున్న దాని కంటే వేగంగానే, ఇష్టంగానే ఈ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించాము. 

ఇంతకు మించిన ఆసక్తికరమైన విషయం మరొకటుంది - ఈ వ్యాసం మొదట తెలుగులో వ్రాసినది మరెవరో కాదు, వేటూరి వారు. ఆయన వ్రాసిన అసలు ప్రతి పోయి, దానికి వేటూరి గారి మిత్రులు శ్రీ ఎస్.రాధాకృష్ణమూర్తి గారు చేసిన ఆంగ్ల అనువాదం మాత్రమే మిగిలి ఉండటంతో, వేటూరి సైట్ నిర్వహకుల కోరిక మేరకు మేము ఈ సాహసం చేయవలసి వచ్చింది. 
*
విశ్వనాథ వారికి 1970-71 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా వేటూరి వారు వ్రాసిన వ్యా…