సరే, గుర్తుచేయన్లే!

తొలిప్రచురణ -సారంగలో.
గుర్తొస్తూంటాయెపుడూ,

వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో
నువు పొగమంచులా ప్రవేశించి 
నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు,

లేలేత పరువాల పరవళ్ళలో
లయతప్పే స్పందనలను లాలించి
ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు
వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు ,

లోతు తెలీని లోయల్లోకి మనం
తమకంతో తరలిపోతూ
మలినపడని మంత్రలోకాల్లో ఊగిసలాడిన క్షణాలు- 

నీకూ గుర్తొస్తాయా, ఎప్పుడైనా...

శబ్దాలు సిగ్గుపడే చీకట్లో
అగణిత నక్షత్ర కాంతుల్ని
నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు,

కలిసి నడచిన రాగాల తోటల్లో
రాలిపడ్డ అనురాగపరాగాన్ని
దోసిళ్ళతో గుండెలపై జల్లి
నను గెల్చుకున్న త్రోవలు,

గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ
గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక
ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు -

సరే, గుర్తుచేయను. సరదాకైనా,
నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను.
పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద
మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.

18 comments:

  1. Really superb superb superb..... mee shaili superb....

    ReplyDelete
  2. /* పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద

    మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు. */

    Beautiful .....!!!!! :-)

    ReplyDelete
  3. /*వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో నువు పొగమంచులా ప్రవేశించి నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు
    అగణిత నక్షత్ర కాంతుల్ని నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు */
    అద్భుతం !!!

    ReplyDelete
  4. * కార్తిక్, శ్రీనివాస్‌గారూ, శ్రీరాంగారూ - కవిత నచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఊహాలోకంలోనికి తెలియకుండానే జారిపోయాను. ఎన్ని పదాలు మింగారేమిటి?.

    ReplyDelete
    Replies
    1. ఇంకా అన్నప్రాశన కానిదే!
      :) థాంక్యూ!

      Delete
  6. తమరు తక్కువ మాట్లాడుతారని క్లాసులో అందరికీ తెలుసు కానీ, వ్రాయడంలో కూడా పొదుపేనా? :))) థాంక్యూ, మహదేవ్!

    ReplyDelete
  7. Okati bagundi ante inkoti baledu ani! Antaa bagunte , inta kanna em matladagalam. Edaina nuvvu cheppinatte eesaari chala manchi tapaa rasavu, replies chooste telustondi. Congrats!!

    ReplyDelete
  8. "నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను..." Oh!!! Beautiful. :)

    ReplyDelete
  9. మానస గారు! మొదటిసారి నేను మీ బ్లాగు చూస్తున్నాను.....ఓ కవితా సముద్రాన్ని చూస్తున్నట్లనిపిస్తుంది, రెండు మూడు కవితలు చదివాను చాలా బాగా రాసారండి.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. శబ్దాలు సిగ్గుపడే చీకట్లో
    అగణిత నక్షత్ర కాంతుల్ని
    నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు,

    కలిసి నడచిన రాగాల తోటల్లో
    రాలిపడ్డ అనురాగపరాగాన్ని
    దోసిళ్ళతో గుండెలపై జల్లి
    నను గెల్చుకున్న త్రోవలు,

    గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ
    గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక
    ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు -

    Simply brilliant !

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....