ఆమె నవ్వాలి మళ్ళీ !


ఏకాంతపు కలయికలలో, కబుర్లలో తొలి అడుగులేసిన స్నేహం
శారద రాత్రుల కవ్వింపుల్లో కోరి పొడిగించుకున్న ప్రణయం
స్మృతి తిన్నెల్లో శాశ్వత ముద్రలేసే జ్ఞాపకాలయ్యాయో
పాల మనసును ముక్కలు చేసిన విషపు చుక్కలయ్యాయో

ఆమె ఎప్పటిలా నవ్వడం లేదిక
అన్నాళ్ళూ తోడొచ్చిన అల్లర్లూ, సందళ్ళూ లేవిక !

ఇప్పుడు మిగిలిందల్లా ..
కలసి పంచుకున్న క్షణాల నిట్టూర్పుల సాంగత్యమే!
కరిగిన వెన్నెల కల లాంటి ప్రేమలో నుండి,
మెలకువలోకి మెల్లగా జారేందుకు, ఎడతెరిపి లేని పోరాటమే!

ఇక ఆమెకు కావలసిందల్లా..
మోహపు ముసుగులు జార్చుకున్నాక
బయటపడే నిజ రూపాలను భరించగల్గిన నిబ్బరం!
భయపు వాకిళ్ళ నుండీ, బాధల సంకెళ్ళ నుండీ
రేపటి ఉదయాన్ని విముక్తురాలిని చేసి
సరి కొత్తగా స్వాగతించాలన్న సంకల్పమూ, స్థిర చిత్తమూ..!!

22 comments:

  1. చాలా బాగా రాశారు మానస గారు

    ReplyDelete
  2. ఆమె సరే.. మరి ’ఆయన’ సంగతి??

    ReplyDelete
  3. @అరుణ్ గారూ, కృతజ్ఞతలు..

    @ హేమంత్...మీరంత పెద్ద సందేహం రేకెత్తించాక, "అతని" గురించి కూడా ఆలోచించక తప్పేలా లేదిక.. :)

    @అక్షర మోహనం : thanks a million for your feedback..

    ReplyDelete
  4. Nice expressions...

    ReplyDelete
  5. పాల మనసును ముక్కలు చేసిన విషపు చుక్కలయ్యాయో
    .
    .
    ఇప్పుడు మిగిలిందల్లా ..
    కలసి పంచుకున్న క్షణాల నిట్టూర్పుల సాంగత్యమే!
    కరిగిన వెన్నెల కల లాంటి ప్రేమలో నుండి,
    మెలకువలోకి మెల్లగా జారేందుకు, ఎడతెరిపి లేని పోరాటమే!
    kavita mottaM baagundi. naaku ee lains baaga nacchaayi!

    bagna hRdayulanu laalinchi Odaarchagala manchi kavita idi.
    adbhutangaa undi!

    ReplyDelete
  6. చాలా బాగా రాశారు మానస గారు

    ReplyDelete
  7. Dear Padmaarpita, Thanks a lot! :)

    @ Bhaskar ...thanks a lot...and it was sure for broken hearts :) As I said, am inspired by a girl whom I meet in my daily commute..I wish she smiles again some day!

    @ Kiran - thank you very much..

    @ Siva Ranani ..dhanyavaadalandee...:)

    ReplyDelete
  8. కూలబెట్టేస్తున్న జ్ఞాపకాల వేర్లను పెకలించుకుని, బూటకపు మైలురాళ్ళ సమాధుల మధ్యనుంచి బయటపడటానికి, ఎందుకనే ప్రశ్నకు విక్రమార్కుని చివరి సమాధానం జవాబంటే ఒప్పుకోని మనసును నిజమనే చేర్నాకోలతో కొట్టైనా సరే ముందుకు నడిపించాలంటే..........రేపటి సూర్యోదయంపై ఎంతో ఆశ, ఆ ఉషోదయానుభవ ప్రాప్తికి తన అర్హతపై నమ్మకం, ముఖ్యంగా తన హృదయపు ఒక పెద్ద భాగాన్ని కోసి అవతలకు గిరాటేసేయగల కర్కశత్వం.......చాలా అవసరం. ఆ ఆశా, నమ్మకం, కర్కశత్వం ఆమెకు ఉంటె మీరు కోరే శరద్వెన్నెల ఆ మోవిపై తప్పక చిగురిస్తుందిలెండి. పక్షం గడవాలి.......అంతే.

    ReplyDelete
  9. @ భావకుడన్ గారూ..
    మీకు తెలీని మనిషి గురించి సైతం మనసుతో స్పందించి, చిరు నవ్వుల వరాలను కోల్పోయిన ఆ అజ్ఞాత జీవన పూదోటలో, తిరిగి సంతోషపు సుమాలు వికసించాలనీ, వికసిస్తాయనీ, అందంగా మీరు విశ్లేషించిన తీరు, అభిలషించిన విధానం, సమాజాన్నే ఒక మూల వస్తువుగా తీసుకుని, మరిన్ని కవితలల్లేందుకు, నాకు తప్పక సాయపడుతుంది.

    మీ స్పందనకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  10. Like it... :)
    Hope you are doing good...

    ReplyDelete
  11. AAMEKU ABHIMANAMTHO...

    karimabbula horuvana.. kurisi veliste...
    neelakasam velugunu kada nirmalamai .
    mohapumusugulu jaari te...
    nishakalmasha manase migiledi.
    marpu sahajam kada..!!
    jgnapakalepudu... teepi gurutule
    aunubhava pathamlo vennela chinukula akshatale..

    ReplyDelete
  12. విజయ్ గారూ,

    చక్కటి కవితను కానుకగా అందించినందుకు, ముందుగా మీకు నా ధన్యవాదాలు.
    చుట్టూ ఎంతో మందిని చూస్తూ ఉంటాం; నిరాశలో, నిస్పృహలో, అన్నీ కోల్పోయాం అనే బెంగ అసలు మనిషిని మింగేస్తోంటే, ముసుగులేసుకు నడుస్తున్న వారిని గమనిస్తూండగా పుట్టినదే ఈ కవితానూ.

    మీరనట్టు ఆ మబ్బులేవో కదిలిపోయి, ముసుగులేవో జారిపోయి, జ్ఞాపకాలు ఇకపై వెన్నాడే భయానక కలల్లా కాక గతంలా మిగిలిపోగలిగితే, నవ్వులవే పరుచుకుంటాయి.

    @ సూర్య కళ్యాణ్ - :) am doing great :). Thank you and hope the same with you!

    ReplyDelete
  13. I loved it..chala baga express chesaru

    ReplyDelete
  14. Chaala bagundi...badhani kuda kavithvam andam ga chesthundemo.

    ReplyDelete
  15. కవిత్వం చాల బాగా రాసారండి..
    ఎంతో భావోద్వేగం తో రాసారనుకుంటా..

    ReplyDelete
  16. thanks to all of you, friends, for your wonderful n motivating feedback.
    @vijay = am out of country for few days and getting little time to update the blog..:) Hopefully, I will be back soon! To our country and to the bloggers world.

    ReplyDelete
  17. I never disturbed around the characters or the final result take issue
    from Blogging for another meshing? The lightning unit of ammunition Q: Mr.
    Obama, you say it's prison term to incredibly potent selling tool.

    My page; click here

    ReplyDelete
  18. stimulate trusted you and keep up through several loose Blogging sites, such as Blogger and news constrict.
    trust me, I'm to occupy reward of this fun way to publicise your on line of reasoning fellowship.

    My site - click here

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....