వెన్నాడే అద్భుతాలు

కొండరాళ్ళ మీద
జారుడు బల్లాటలో
ఒకరినొకరు తోసుకునే
చినుకు కన్యలు

వెన్నెల పరుగులకు
వెనుకెనుక పడుతూ
పట్టు చిక్కాక పకపక నవ్వే
సెలయేటి నురగలు

వెలుగు పూలు జల్లే సూరీడికై
రాతిరంతా రహస్యంగా శ్రమించి
రంగవల్లులతో ఆహ్వానం పలికే
గగనపు లోగిలి

అరుణ వర్ణ ప్రభాతాల్లో
చినుకుల చిలిపితనంతో
సెలయేరల్లే తుళ్ళిపడే నన్ను
బంధించి నిలబెట్టే -నువ్వు - నీ నవ్వు!!

24 comments:

  1. nijam gaane adbhutam gaa varninchaaru chaalaa baavundi

    ReplyDelete
  2. చాలాబాగుందండి

    ReplyDelete
  3. "జారుడు బల్లాట ఆడే చినుకు కన్యల" దగ్గరే చాలా సేఫు ఆగిపోయాను. అద్భుతంగా రాసారు. అభినందనలు!

    ReplyDelete
  4. అత్యంత మధురంగా ఉందండి :)

    ReplyDelete
  5. అందంగా ఉంది! :)

    ReplyDelete
  6. నేను కూడా కొత్తావకాయ గారి దగ్గర నుండి కదల్లేకపోయాను :) అంత బాగుంది.. చినుకు కన్యల జారుడు బల్లాట, ఆ ప్రయోగం, ఆ ఊహ..

    ReplyDelete
  7. నాకూ అర్థమైపోయింది :) నాకూ అర్థమైపోయింది :) ..చాలా బాగుంది :)

    ReplyDelete
  8. ela vastaayi neeku inni alochanalu manasa... simply superbb..

    ReplyDelete
  9. రచనల స్థాయి పెరిగేది, వాటి అందం ఇనుమడించేది పంక్తుల మధ్యనున్న ఖాళీలను దొరబుచ్చుకోగల, అనుభవించగల పాఠకుల వల్లే!
    నన్ను కదిలించిన కవితా వస్తువులు సాహితీ మిత్రులందరినీ ఆహ్లాదపరచడం సంతోషాన్నిస్తోంది. నా కళ్ళతో దృశ్యాలను అనుభవించిన మీ అభిరుచికి, అందించిన అభినందనలకీ, థాంక్యూ!

    ReplyDelete
  10. Haritha MusunuriTuesday, June 19, 2012

    As usual chala bagundi maani... pada prayogalanni adhbutam ga kudirayi..! ni kavitha lo maturity kanipistondi...!

    ReplyDelete
  11. Just in love with the framing. Nice lines :-)

    ReplyDelete
  12. inni comments tharvaatha nenu cheppadaanikemee migalledu..vaaa....vaa...

    ReplyDelete
  13. వెలుగు పూలు జల్లే సూరీడికై
    రాతిరంతా రహస్యంగా శ్రమించి
    రంగవల్లులతో ఆహ్వానం పలికే
    గగనపు లోగిలి
    మంచి కవితా ప్రయోగం .విలక్షణం గా వుంది.మీ కవితా శైలి .ఇలాంటిదే "ప్రకృతికే సరికొత్త భాష్యానిద్దాం "అనే నా కవితలో వర్ణించాను.చూడగలరు.

    ReplyDelete
  14. చాలా సుతారమైన, అందమైన ఇమేజరీ.. హాయిగొలిపే కవిత్వం..

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....