చంద్రకాంతమణి


తొలి ప్రచురణ ఈవేళ్టి (09-02-2014) ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో  

వాడు 'రా నానా' అంటూ గారాలు తొడుక్కుని
గాలికి విరిగే కబుర్లలో నను నడిపించుకెళ్తాడు.
ఉప్పునీటి తీరంలో ఉరికే ఉద్వేగాలన్నీ
చెదరగొట్టిన ఏడు పెంకుల్లో ఏరుకోమంటాడు.
తుళ్ళేటి అలలపై తెలివెన్నెలై తేలివచ్చి
సముద్రపు హోరంతా శంఖంలో దాస్తాడు.
ఎగిరే గాలిపటాల దారాలు తెంపేసి
ఎల్లల్లేని గగనానికి కొత్త రంగులద్దుతాడు
ఇసుక గూళ్ళలో పట్టని దేవుళ్ళందరినీ
పెదవి ఒంపులో ప్రతిష్టించుకుని
తారలు తలలొంచే నవ్వులతో
చిందాడీ పాడీ అలసిపోయాక
మూపు మీద ఉప్పుమూటై వాలిపోతాడు.
ఎదురు చూస్తున్న పెరుగన్నం ముద్దకి
వణుకుతోన్న తడిదేహా నప్పజెప్పేప్పుడు,
బిగిసిన పసి గుప్పిట్లోంచీ నున్నటిదేదో
చంటిగాడి ఉలికిపాటుతోనే జారిపడ్డప్పుడు, 
అలవాటైన అనుమానపు చూపులతో
ఆ రాయినలా ముట్టుకుంటానో లేదో
సముద్రమంత చల్లదనం నాలోకి ప్రవహిస్తుంది.
ఇంత క్రితం తీరాన మెరసిన వెన్నెలేదో
ఉన్నట్టుండి పరుచుకుంటుంది, 
మా ఇరుకిరుకు గదుల్లో, మనసుల్లో.

11 comments:


  1. తుళ్ళేటి అలలపై తెలివెన్నెలై తేలివచ్చి
    సముద్రపు హోరంతా శంఖంలో దాస్తాడు. enta adbuthamgaa undo....
    ohh adbuthahhha:-):-)

    ReplyDelete
  2. ఎప్పటి లాగే ......బాగుంది మానసా! ఎక్కువ మంది పాఠకులకు చేరువవుతున్నందుకు సంతోషమూ, అభినందనలూ!

    ReplyDelete
    Replies
    1. సుజాత గారూ, :))
      Thank you so very much :)

      Delete
  3. Bavundandi book lo chusanu.Radhika(nani)

    ReplyDelete
  4. Bavundandi book lo chusanu.Radhika(nani)

    ReplyDelete
  5. ఆకసానికీ -
    అవనికీ -
    అంబుధికీ -
    రంగులద్దే అద్భుత నైపుణ్యమూ -
    అతులిత పద సంపదా -
    అప్రతిమాన భావనా బలం -
    వెరసి - చంద్ర కాంత మణి .
    సుజన-సృజన

    ReplyDelete
  6. *రాధికగారూ, ధన్యవాదాలండీ!

    *వెంకట రాజారావుగారూ - మీ ప్రశంసా వాక్యాలకు కృతజ్ఞురాలిని. కవిత మీకు నచ్చినందుకు సంతోషమూనూ. ధన్యవాదాలు.

    *వంశీకృష్ణగారూ - ధన్యవాదాలండీ!

    ReplyDelete
  7. "గాలికి విరిగే కబుర్లు",
    "గగనానికి గాలిపటాల రంగు"
    "ఇసుక గూళ్ళలో పట్టని దేవుళ్ళు"

    అద్భుతమైన ఎక్సప్రెషన్స్, ఇవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి.
    మంచి కవిత, థాంక్స్ అండ్ కంగ్రాట్స్.


    ReplyDelete
    Replies
    1. మొదట వనజ వనమాలి గారు అనుకున్నానండీ మీ పేరు చూసి..పొరబడ్డాను. మీ పేరు తెలియలేదు- బ్లాగ్ బాగుంది. మీ అభినందనలకు కృతజ్ఞతలు.:)

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....