నడిరాతిరి వేళ 
చీకటి గూటిలో వెలిగిన దీపంలా
చందమామ
ఇదుగో చూడూ, నా అరచేతిలోనూ 
ఆకుపచ్చగా నవ్వుతూ
 ఎర్రగా నాలోకి ఇంకుతూ.
*********
ఆకాశమంతా
కెంజాయ మెరుపులు
చెక్కిలి గిల్లి నవ్విందెవ్వరు?
చందమామ చెదిరిపడ్డ
లేలేత అరచేతులు.
          సిగ్గులు పండించిన ప్రియసఖుడెవ్వడు?  
