వసంతపు దారిలో


కాలం సంగతి మనకెందుకు,
ఇలా రా - ఏటిఒడ్డు వైపు.
గులకరాళ్ళ చప్పుడొకటి అడవి గుండెల్లో,
ఎన్నడూ వినని అడవి పాటేదో ఏటి గొంతులో,
వింటున్నావా?
అహ, చెవులు రిక్కిస్తే వినపడవవి.

ఎందుకు పదే పదే తలెత్తి చూస్తావ్,
సూరీడేమైనా సమయం చెప్తాడనా?
కాలం సంగతి వదిలెయ్ -
లేచివుర్ల వయసెంతో
వీచేగాలి బలమెంతో
వానచుక్క ఎందాకా ఇంకిందో
చెప్పగలవా?
అహ - నీ సూత్రాలకు తలొగ్గవవి.

పోనీ కాసేపాగగలవా
పరిమళపు తుఫాను మొదలవుతుంది
ఆకాశానికి కలువపూలకీ వంతెన వేస్తారెవరో
చందనం చల్లి లోకాన్ని చల్లబరుస్తారెవరో 

ఇప్పుడంటే ఇలా భయపడుతున్నావ్ కానీ,
నీ గుప్పిట్లోని నా చేతిని మళ్ళీ మళ్ళీ చూస్తున్నావ్ కానీ,
అడవి దారి అర్థం కాక దిక్కులు చూస్తూ 
కాలం నిను వదిలేస్తుందని దిగులుపడుతున్నావ్ కానీ

నీ భయాల్తో, సంశయాల్తో
నిద్రపట్టక నీలాకాశంలోకి చూసినప్పుడు,
నీకూ తెలుస్తుంది
చీకట్లో మిణుకుమిణుకుమనే వెలుగొకటి ఉంటుందని,
ఆశ గట్టిదైతే ఆకాశమంతా నీ చూపుల్లో ఒదుగుతుందనీ

అడవి దారి-అడవి పాట-అడవి చూపు
రహస్యాలన్నీ ఒక్కరాత్రిలో అర్థమయ్యాక
రేపిక నువ్వే అంటావ్ చూడూ,
కాలంతో మనకేం పనిలేదని

14 comments:

 1. Replies
  1. స్మైలీలు పెట్టిన వేరేవాళ్ళకి స్మైలీతో జవాబిచ్చి,రహ్మనుద్దీన్ గారి మీద మాత్రం "గుర్రు"మంటున్నారెందుకు పాపం ?

   Delete
  2. :) తృష్ణ గారి నవ్వు నచ్చింది. :)
   రెహ్మాన్ గారి నవ్వు అర్థం కాలేదు :), ఆయన పదాల పొదుపు మీద అలక. :)

   Delete
 2. '..వింటున్నావా?'
  వింటున్నాను..
  '..చెప్పగలవా?'
  చెప్పగలను..
  'పోనీ కాసేపాగగలవా?'
  అస్సలు ఆగలేను. కవిత్వం నాకు పడదు. పారిపోవాలి.

  :p

  ReplyDelete
 3. /* చీకట్లో మిణుకుమిణుకుమనే వెలుగొకటి ఉంటుందని, ఆశ గట్టిదైతే ఆకాశమంతా నీ చూపుల్లో ఒదుగుతుందనీ.

  చాలా బాగుంది మానసగారూ! :-)

  ReplyDelete
 4. గులకరాళ్ళ చప్పుడొకటి అడవి గుండెల్లో,
  ఎన్నడూ వినని అడవి పాటేదో ఏటి గొంతులో,
  వింటున్నావా?
  అహ, చెవులు రిక్కిస్తే వినపడవవి. ee expression enta beautifulgaa undoo...:-):-)

  ReplyDelete
 5. శ్రీనివాస్‌గారూ, రావుగారూ, కార్తిక్ - ధన్యవాదాలు. :)

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...