దేవకన్య

ఎంత సున్నితత్వం నీలో!
పూవు అందంగా సిగ్గుపడింది.
నాకెప్పుడూ నువ్విలాగే కనపడాలి!
సౌందర్యం రెపరెపలాడింది.
పాటలేమైనా పాడగలవా?
సంగీతం గొంతు సవరించుకుంది.
నన్నొక్కసారి ముద్దుపెట్టుకోవూ?
ప్రేమ ఆర్తిగా పెనవేసుకుంది.
ఇల్లెప్పుడూ కళకళలాడుతుండాలి!
ప్రకృతి లోగిలిలో పచ్చగా నవ్వింది.
నా తెలివి ముందు వాళ్ళెంత!
మౌనం నిండుగా విచ్చుకుంది.
పూర్తిగా ఓడిపోయాను, వేరే దారేదిక?
ధైర్యం కౌగిలినిచ్చి ఊరడించింది.
నీ ముఖం నాకు చూపించకు, కంపరం!
సహనం అవమానాన్ని భరించింది.
ఏయ్, ఒకసారిటు నాదగ్గరికి రా!
ప్రేమ ఉలిక్కిపడి ఉన్నదంతా ఇచ్చింది.
ఆవేశంలో జరిగింది, ఇదేమంత కాని పని!
అనుబంధం అగ్నిసాక్షిగా విలవిలలాడింది.
మనసంతా నీవే అని చెప్పిందెప్పుడూ?
గుండె పగిలిపోయి ముక్కలయింది.
శాపమోక్షమైన దేవకన్య నవ్వింది. శపించకుండానే వెళ్ళిపోయింది.

6 comments:

  1. Nenu already ee maaTaloa chadivaanu Manasa gaaru... enta baagundoooo...:):)

    ReplyDelete
  2. బాగుందండి. మంచి దేవకన్యే:)

    ReplyDelete
  3. "నా తెలివి ముందు వాళ్ళెంత!" ఇదొక్కటీ తప్ప ఆద్యంతమూ మీ ముద్ర ఉంది మానసా! మంచి ప్రయత్నం! మీ కవితల్లో ఓ బలమైన సాంద్రత ఉంటుంది--ఓ బలమైన కెరటం గజఈతగాణ్ణీ లాక్కెళ్ళినట్లు....

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్‌గారూ, మీ మొదటి వాక్యంలో సత్యం లేకపోలేదు :). మీ ఆత్మీయస్పందనకు కృతజ్ఞతలు.

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....