రా!

ఏమో, బ్రతుక్కింకా
కలల్ని అమ్ముకుని
కన్నీళ్ళు దాచుకోవడం రాలేదు.
దాహాలు దాచుకున్న చూపుల్తో
దిక్కుల్ని మింగేయడమెలాగో తెలీలేదు
మోహాలు దేహాల్ని బంధిస్తాయని
విరహాల నెగళ్ళలో నిప్పులవడమూ నేర్వలేదు

అయినా చెప్పాలిప్పుడు,
రెక్కలెవరివో తెగిపడతాయని
వత్తుల్ని నలిపి వెలుగుల్నార్పేయకు
చుక్కలు రాల్తాయని భయపడి రాత్రిళ్ళు
వెన్నెల నడవితో నిద్రించమని వదిలేయకు
వెలుగు నీది! వెన్నెలా నీదే!

కార్చిచ్చల్లే లేస్తున్నాయా కోరికలు?
కావలింతల్లో ఊరటుంటుంది రా!
గాయాలవ్‌తాయనా? 
మొద్దూ,
మందుంది నా దగ్గర.
అన్నింటికీ.

7 comments:

 1. Mahadev PisipatiTuesday, May 13, 2014

  Nee Bhavukata ki joharlu !
  okka viraham lo, "ra !" anna padaniki inta vyutpatti ardham unda :)))))

  Nice one.

  ReplyDelete
 2. బాగుంది మానస గారూ! రోజు రోజుకి మీ కవితల్లో ఎదుగుదల కనిపిస్తుంది. Keep writing.

  ఇందులో "నెగళ్ళు" అనడం విశేష్యమా? క్రియా పదమా?

  కార్చిచల్లే --> కార్చిచ్చల్లే - Typo

  ReplyDelete
 3. Thank you Mahadev, thanks AB :)
  Just my experiements with letters.

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...