పంతం

రోజురోజూ నేనేం లెక్కపెట్టుకోను
మారే ఋతువుల నసలు పట్టించుకోను
ఉన్నదొక్కటే దేహం
మనసుకొక్కటే పంతం
పరిచయమూ నీవల్ల ప్రియమూ అయిన నిశ్శబ్దాన్ని
పట్టుకోకూడదని తెలుసు కానీ
జారిపోనీయలేను
ఈ చలికాలపు పొద్దును.
నిన్ను.

*తొలి ప్రచురణ : ఈమాట, మే -2018 సంచికలో.

No comments:

Post a Comment

ప్లవ

ప్రేమించు మిత్రమా! ప్రేమించు రేపటి నీ రోజుని. నీ ఉగాదిని. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ కలలనూ కోర్కెలనూ ప్రేమించుకున్నట్టు ఇష్టంగా బలం...