చుక్కలతో మెరిసిన రాతిరి ఒకటి

ఇంజనీరింగ్ రోజుల్లో స్నేహితులందరం కలిసి పూనేలో ఏవో ఇండస్ట్రీస్ చూసే వంకన బొంబాయి రైలెక్కాం. గడియారం పది గంటలు కొట్టగానే సోలిపోయే నేను, ఆ వేళ నిద్ర కాచుకుని స్నేహితులతో సైడ్ లోవర్‌లో కూర్చుని ముచ్చట్లాడుతున్నాను. బయట నుండి చలిగాలి రివ్వురివ్వున తోసుకొస్తోంది. ఊచల మీద వాలిన మా అరచేతులు మంచుముద్దలవుతున్నాయ్. గాలి ఒదుగుకి బుడగలా పైకి లేస్తున్న పల్చటి సిల్కు చున్నీలను నొక్కి ఒళ్ళంతా తిప్పి చుట్టుకుంటున్నా, లోపలి వణుకు తెలుస్తూనే ఉంది. అయినా మేం తలుపులు మూయలేదు. కాసేపటికి రైలుబండి నడక లయతో పాటుగా చెవులకు లోబడిపోయింది. చిన్నచిన్న ఊర్ల చిరువెలుగులు కూడా మెలమెల్లగా మాయమవుతున్నాయి. లోకం నిద్రపోతే తప్ప ఆవరించుకోని ప్రశాంతత ఏదో అనుభవంలోకి వస్తోంది. లాంతరు వెలుగును ఎవరో దగ్గరుండి పెద్దది చేసి అదే వడిన ఆర్పేసినట్లు, ఏదైనా స్టేషన్ దగ్గరకు వస్తుంటే ఉండీఉండీ కళ్ళల్లో పడే వెలుగు. దాటగానే మళ్ళీ కుదురుకునే చీకటి. ఆ చీకట్లోకి చూపు సారిస్తే, అకస్మాత్తుగా ఎవరో తెర వాల్చినట్టు, ఆకాశంలో కోటానుకోట్ల నక్షత్రాలు. కిటికి దగ్గర్నుండి లేచి, తలుపు దగ్గర వేలాడుతూ నిలబడి, ఆ రాత్రి చూసిన నల్లటి ఆకాశం, ధగధగా వెలిగిన తారల మెరుపు...ఇదిగో...ఈ పోస్టర్ చూస్తే ఈరోజెందుకో మరీ మరీ గుర్తొచ్చాయి. 13 comments:

 1. Hello Manasa garu,
  As always your writings are so amazing and very pleasant.
  I don't think if I have ever posted any comment before but I do wander around your blog and whenever I enter, I don't leave with out reading at least 2 or 3 of your write up's, though they are repeats for me.
  Today I too appeared, one among those million stars, Bright ?

  ReplyDelete
 2. Thank you so much Surabhi garu..am so glad you are enjoying this blog. Truly humbled..thanks again..

  ReplyDelete
 3. అభివందనములు..ఇకపై బ్లాగ్ లో రాస్తూ ఉండండి-పద్మార్పిత

  ReplyDelete
 4. Hi.. Amma vellina rathri ane vachanam kavitvam chadivaanu chaala అద్భుతంగా ఉంది అండీ.. దానిలో meeru cheppina ilayaraja paata ohh paapa laali naa.. Adento cheppandi

  ReplyDelete
  Replies
  1. Sunil gaaroo...ఆ పాట కాదండీ :) - ఆ పాటలు మారుతూ ఉండేవి - రింగ్‌టోన్ వాడిన కొన్నాళ్ళలోనూ. కానీ ఏ ఇళయరాజా పాట విన్నా, ఇల్లు గుర్తొస్తుంది - (అక్కడే అన్నీ మొదటగా విని ఉంటాను కాబట్టి..) అదొక నాస్టాల్జియా. Thank you for your kind response.

   Delete
  2. Thanks for clarifying andi.. Mee blog chaala baagundi.. You deserve large audience.. Meevi ఇంకా emaina platforms లో unnaaraa.. Meeru books emanna raasthe cheppandi

   Delete
  3. ఫోన్లో పాటలు vinadam వల్ల ఇప్పుడు ఆ nostalgia లేదు.. నా చిన్నప్పుడు విన్న పాటలు ఇప్పుడు ఎక్కడ విన్న అప్పటి vishayalanni gurthukuvasthaay.. Like choosina Cinema మళ్లీ ఎప్పుడు చూసిన అప్పటి paatha విషయాలు gurthukochhinattu..

   Delete
 5. రైలు కిటికీ లో నుంచి నక్షత్రాలు కనిపించాయా. I don't think this is true.

  ReplyDelete
 6. Honestly, that’s how I remember it 😊

  ReplyDelete
 7. మానస గారు,
  సాహిత్య అకాడెమీ వారు నిర్వహించే “ప్రవాసీ మంచ్” కార్యక్రమంలో మీరు, “నిషిగంధ” గారు, మా తమ్ముడు విన్నకోట రవిశంకర్ ఈనెల (జూన్) 21న మీ మీ తెలుగు కవితలు చదివారని తెలిసింది. సాహిత్య అకాడెమీ వారి గుర్తింపు పొందడం చెప్పుకోదగిన విశేషం. మీ ముగ్గురికీ నా అభినందనలు ��।

  మా తమ్ముడు పంపించిన విడియో చూశాను. ముగ్గురూ మంచి కవితలు చదివారు, చక్కగా చదివారు. సంబంధిత విడియో ఈ క్రింద ��.

  మీ బ్లాగ్ ప్రొఫైల్ లో మీరు బెంగళూరు నివాసి అని ఉంది. ప్రవాసిగా మారారని ఈ విడియో చూస్తే అర్థమవుతోంది.
  PhD కూడా చేసినట్లున్నారు, అభినందనలు.

  సాహిత్య అకాడెమీ వారి “ప్రవాసీ మంచ్” కార్యక్రమం (21-06-2020)

  ReplyDelete
  Replies
  1. చాలా చాలా సంతోషమండీ..రవిశంకర్ గారి కవితలు లైవ్‌లో వినడం నాకూ చాలా సంతోషాన్నిచ్చింది. నిషీ కూడా ఉండటం నాకు అదనపు బలం :)

   మీ మంచి మాటలకు నిజంగా థాంక్స్..
   ఈ ప్రవాసం కొన్నాళ్ళేనని మార్చలేదండీ...ఈ కరోనా కాస్త నెమ్మదించగానే బెంగళూరే మళ్ళీ. అన్నట్టూ..డాక్టరేట్ ఇంకా రాలేదండీ.. :)) - అది చిన్న పొరబాటు. సరిచేసే వీలుందేమో అడుగుతాను వాళ్ళని.

   Regards,
   Manasa

   Delete
 8. మానస గారు,
  పైన నా కామెంట్లో నేనిచ్చిన మీ "ప్రవాసీ మంచ్" ప్రోగ్రామ్ విడియో లింక్ పనిచెయ్యడం లేదని కొందరు మిత్రులు తెలియజేశారు. సరి చేసిన లింక్ ఈ క్రింద ఇస్తున్నాను👇.

  సాహిత్య అకాడమీ వారి "ప్రవాసీ మంచ్" కార్యక్రమం (21-06-2020)

  https://youtu.be/fOhLII9uZAI

  ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....