" తెరతీయగరాదా" - కథా విశ్లేషణ - Thanks to Kathajagat :)

Updated :
వంద కథల్లో ఏ కథను ఎంచుకోవాలో అని చాలా బెంగ పడ్డాను మొదట. చివరికి వరుసలో అమ్మ ఇంటి పేరు కనపడగానే ఆగిపోయి కథా అంతా చదివాను. నా ఆలోచనలన్నీ  వరుస క్రమం లో పెడితే, ఇదిగో...ఇలా ముస్తాబయ్యింది.
దీనికి కథా జగత్ విశ్లేషణా  పోటీల్లో రెండవ బహుమతి రావడం ఒక బోనస్ లా ఉంది. దానికి వాళ్ళు నగదు బహుమతి కూడా ప్రకటించడం తో ఆశ్చర్యం రెండితలైంది.Details here -
http://turupumukka.blogspot.com/2010/07/blog-post_28.html
Many thanks to the organizers for giving me a reason to celebrate today! :)
-------------------------------------------------------------------------------------------------------------------------
గుండె తలుపు తట్టిన తలపులన్నీ మైమరపించే కథలు కాలేవు. మంచి కథలో మంచి భాష ఉండాలి.భావోద్వేగం పండాలి.అంతర్లీనంగా మనసును స్పందింపజేసే కథాంశం , చివరి వరకూ చదివించగలిగిన పట్టూ ఉండాలి.మనకి తెలీకుండానే కథలో ఇమిడిపోయేటంత అద్భుతంగా రచన సాగాలి.ఈ లక్షణాలతో, దాదాపు నలభై ఏళ్ళ క్రితం రాయబడ్డ ఒక కథకు విశ్లేషణే నా ఈ రచన.

కొన్ని కథలు సమకాలీన సమస్యలను అతి గొప్పగా చిత్రిస్తాయి. చదివిన రోజున, 'ఆహా..' అనిపించినా , రెండో సారి చదివేటప్పటికే చప్పబడిపోతాయి. మరికొన్ని కథలుంటాయి. అవి ఎల్ల వేళలా ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటాయి.ఎందుకంటే, అవి మనలో నుండి పుట్టినవి. మనిషిని మనిషిగా చిత్రించేవి. అద్దంలా మారి అక్కడ మనని మనకే చూపిస్తాయవి. మహామహుల ఆలోచనల ఆల్చిప్పల్లో పడి, ఆణిముత్యాలల్లే మారి బయటకు వస్తాయి. కోడూరి శ్రీ రామమూర్తి గారి "తెరతీయగరాదా.." నాకలాంటి ఆణిముత్యమంటి కథలానే తోచింది.

వారి రచన ఒక ప్రవాహంలా సాగుతుంటే, ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోవడంలో ఎంత సంతోషం..! పాత్రల తాలూకు ఉద్వేగపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి మానస తీరాలను తాకుతున్నప్పుడు చెమ్మగిల్లిన కన్నులతో ఆఖరి వాక్యాన్ని ముగించి నిట్టూర్చడంలోనూ ఎంతటి పారవశ్యం..!

స్థూలంగా చెప్పాలంటే, ఇది నాలుగు మనసుల కథ. రచయిత ప్రతి పాత్రలోనూ  పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ మనసులోని భావాలని అక్షరాలుగా మార్చి కథ రాసారేమో అన్నంత సహజంగా సాగుతుందీ రచన. బహుశా ఆ శైలే ఈ కథకి నిజమయిన బలమేమో..

ప్రాణమిత్రుడు శేఖర్ ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నాడని బెంగపడి, అతని ఆ స్థితికి కారణమైన అమ్మాయిని నిలదీయాలని ఆరాటపడే రామనాథ్,పైకి మొండిగా, తల బిరుసు గల అమ్మాయిగా కనిపించినా, తన మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియబరచక, తెలియబరచలేక,ఆఖరి వరకూ మనం అర్థం చేసుకోలేని ఆవేదనతో తల్లడిల్లిపోయిన ఇందిర,1970 కాలంలో అప్పుడప్పుడే తొలగిపోతున్న జమీందార్ భోగాలను, వారి సహజ లక్షణాలను, ఆలోచనా విధానాలను జ్ఞప్తికి తెచ్చే శ్రీనివాసుగారి పాత్ర ఈ కథకు మూల స్థంబాల్లాంటివి.

కథ విషయానికి వస్తే, ఇందిర పాత్ర మన మనసుల్ని కుదిపేస్తుంది. రామనాథ్ పాత్ర ద్వారా మనం ఉహించుకున్న ఇందిర, కథ ముగిసే వేళకి, ఆయనకి రాసిన ఉత్తరంతో ఆవిష్కృతమయిన అంతరగంతో కొత్తగా కనపడి, ఆలోచనలను మెలి తిప్పుతుంది.

ఆ కాలం జమీందార్లకు స్వతహాగా ఉండే కళాపోషణను, వారి సాహిత్యాభిలాషను శ్రీనివాసరావుగారి పాత్ర ద్వారా కథలో స్పష్టపరచిన తీరు అమోఘం.ముఖ్యంగా త్యాగరాజ  కీర్తనలను ప్రస్తావిస్తూ .."'ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో - గగనంబు కిలకూ బహుదూరం బనినాడో -' అన్న పాదాన్ని ఉదహరించడం, దానికొక వినూత్నమైన విశ్లేషణను జోడించడం ఎందరో  సంగీత ప్రియులకు ఆనందాన్ని పంచడంలో అబ్బురమేముంది..? రచయితలోని కవి హృదయానికి ఇదొక మచ్చు తునక మాత్రమే సుమా..!

ఆధునిక భావాలున్న మనిషిని కనుక ఇందిర శ్రీనివాసరావు గారి దగ్గర కొరడా దెబ్బలు తినడం వంటి వాక్యాలను సహించలేకపోయిన మాట వాస్తవం. సమస్యలను ఎదుర్కొనగలిగిన సమర్ధత లేని వ్యక్తులు, తమలోని బలహీనతలను జయించే ప్రయత్నం చేయక, అనుసరణీయం కాని ఒక మార్గాన్ని ఎంచుకుని తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు అన్న సందేహం, నన్ను ఆఖర్లో కాస్త కలవర పెట్టింది.ఆమె చదువుకున్న అమ్మాయి కనుక, శిధిలమయిపోతున్న గోడలను దాటి బయటకు వచ్చి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగల సమర్ధతను ఆ పాత్ర నుండి ఆశించినా, ఎదురు తిరగక అణిగి ఉండటాన్ని అంగీకరించలేకపోయినా, నా ఈ ఆలోచనలనన్నింటినీ సమాధాన పరచగల రసవత్తరమయిన కథనమేదో నా నోరు నొక్కేసింది. నిజానికి రెండోసారి చదివినప్పుడు, ఇందిర పాత్రలోని ఆ నిస్సహాయతా, నిజాయితీలే కథకి అందమేమో అనిపించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను.

"మత్సరమే కాదు మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న తెరలు మరెన్నో ఉన్నాయి. మనిషి ఆ తెరని తీయనూ లేడు. వాటి సంగతి మరచి ప్రశాంతంగా వుండనూ లేడు " అన్న నిష్టుర సత్యాన్ని నిండైన కథగా మలచి, "..ధర్మాది మోక్షముల పారద్రోలుచున్న నాలోని మత్సరమను తెరతీయగరాదా..." అన్న త్యాగరాజ కీర్తనను ఆధారంగా చేసుకుని శీర్షికను ఎంచుకోవడం , దాని ప్రస్తావనతోనే కథను ముగించడం సముచితం.

ప్రతి కథకీ ముగింపే కీలకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆఖరికి మంచి గెలిస్తే మంచి కథనేస్తాం చప్పున. అదే చెడు గెలిస్తే, నమ్మలేనిదేదో జరిగినందుకు నిర్లిప్తంగా పుస్తకాన్ని మూసేస్తాం. ఆంగ్లంలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది.." Man will believe only what he wants to believe.." అని. అది అక్షర సత్యం.అయితే, కథల్లో, ఇలా మంచీ చెడూ అని నిర్ణయించ వీలు కాకుండా ముగిసేవి కొన్ని ఉంటాయి. మరపు రాని కథల్లో వాటికంటూ ఒక చోటు వెదుక్కునే ముందు, పాఠకుల మస్తిష్కాల్లో తిష్ఠ వేసుకుంటాయి.

"తెరతీయగరాదా.." ఈ మూడో కోవకే చెందుతుందో లేదో తెలియాలంటే,ఇందిర జీవితాన్ని చదివి ఆమె నిర్ణయం తప్పో-ఒప్పో నిర్దారించాలంటే, కథాజగత్ లోకి అడుగిడి ఈ కింద ఇవ్వబడిన 1969 నాటి అరుదైన కథను చదవడమొక్కటే మార్గం.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/teratiyaga-rada---koduri-శ్రీరామమూర్తి

21 comments:

 1. Radhika InampatiTuesday, July 13, 2010

  మానస గారూ, కథతో పోటీలు పడి సాగిన మీ సమీక్ష చాలా చక్కగా ఉంది.
  కథలోని మలుపులను విప్పి చెప్పకపోవడంతో, చదవాలనే ఆసక్తి కలిగింది.
  బహుమతులతో నిమిత్తం లేకుండా, మంచి కథలను, పుస్తకాలను విశ్లేషించే బాధ్యత చేపట్టండి.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. wowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
  em chepparu ..........u have good hold in analyzing such good story.
  i invite u to my blogs and make me happy with ur worthy comments.

  ReplyDelete
 4. రాధిక గారూ,
  హృదయపూర్వక కృతజ్ఞతలండి..
  నిజానికి కథ గురించి నాకు అనిపించింది స్నేహితులతో పంచుకోవడం అలవాటు. ఈ సమీక్ష కూడా అలా రాసిందే. అంతే తప్ప నేను మాములుగా సమీక్షలు రాయడం అరుదు. మనసును కదిలించిన కథలుంటే, మన భావాలు, మన ఆశలు విశ్లేషణల రూపం లో వాటంతట అవే బయటకి వచేస్తాయేమో!

  ReplyDelete
 5. సావిరహే గారూ,
  ధన్యవాదాలు..తప్పకుండా , మీ బ్లాగ్ నేను చదువుతున్నాను...నా అభిప్రాయలు తప్పక తెలియజేస్తాను. తప్పొప్పులు చెప్పేటంత మాత్రం ఇంకా ఎదగలేదు...:):)

  ReplyDelete
 6. మీ విశ్లేషణకు రెండవ బహుమతి వచ్చింది. అభినందనలు! వివరాలకు ఇక్కడ చూడండి. http://turupumukka.blogspot.com/2010/07/blog-post_28.html వెంటనే mmkodihalli@gmail.comకు కాంటాక్ట్ చెయ్యండి.

  ReplyDelete
 7. మురళి మోహన్ గారూ,
  హృదయపూర్వక కృతజ్ఞతలు..మీకు ఈమెయిలు మిగతా వివరాలతో పంపిస్తాను..

  ReplyDelete
 8. మానస గారు,
  హార్ధిక శుభాభినందనలు.

  ReplyDelete
 9. mansa garu..amogham gaaa varnincharu andi.. mee vishleshana chaala adbhutam gaa undi.. meeku prize raavadam chaala anandam gaa undi

  ReplyDelete
 10. congrats andi :-)))))) party eggottaru gaa !!!!

  ReplyDelete
 11. చాలా బాగా విశ్లేషించారు
  ప్రైజ్ వచ్చినందుకు అభినందనలు

  ReplyDelete
 12. @Lokesh Srikanth: Thank you..:)
  @A Trip to Goa - Thank you for your note of appreciation..
  @Savirahe garoo, Party tappakunda istaanu, mee vivaraalemito maaku cheppandi mari mundu :p
  Madhuravani garoo- Thanks a lot..:)
  @HAre Krishna, thank you very very much..:)

  ReplyDelete
 13. Chala Chala Baaga Raasav..Congrats Manasa..:)

  ReplyDelete
 14. DEEPS..!! thank you very much da..you are finally here :)

  ReplyDelete
 15. కథా శతవసంతాన మీకు అభినందనలు.

  ReplyDelete
 16. మీ ఈ కథా విశ్లేషణకు ద్వితీయ బహుమతి వచ్చినందుకు అభినందనలు .

  ReplyDelete
 17. Umadevi garoo,thanks a lot, I have sent you an email.
  Mala Kumar garu, Thank you very much for your wishes...

  ReplyDelete
 18. మానసగారు, నాకు కొన్ని నవలలో సందేహాలు ఉన్నవి...నాకు కొంచెం నివృత్తి చేయండి...ప్లీజ్

  ReplyDelete
  Replies
  1. మానస గారు నమస్కారం!
   అక్షరఇక్షురస మానససరోవరమైన మధుమానసంలో
   మంచి కథను మీ విశ్లేషణతో చదివించినందుకు ధన్యవాదాలు
   ఈ కథను నేను చదువుతూ ఉదహరించిన పాటలను యూట్యూబ్ లో వింటూ చదివాను. కాదు కాదు అనుభూతించేను. అయితే మీ అంత అందంగా విశ్లేషణాత్మకంగా వివరించలేను
   నమస్సులతో
   సత్యసాయి విస్సా

   Delete
 19. మీ విశ్లేషణ పుణ్యమా అని ఒక మంచి కథ చదివాను. బహుమతి పొందిన మీకు శుభాభినందనలు.

  ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....