"నిను వినా.."

                                  
ఎవ్వరూ లేని సాగర తీరంలో పరుచుకున్న వెన్నెల్లాగా 
ఏకాంతంలో నీ జ్ఞాపకాలు చుట్టుముడతాయి..
వర్తమానం ఒంటరిదై ముడుచుకుంటుంటే.
ఆలోచనలు పసిపిల్లలల్లే బాల్యంలోకి పరుగులెడతాయి..
పందిరి పై దాకా పాకిన సన్నజాజి తీగల్లాగే..
నా జీవితంలోని ప్రతి ఘడియా నీ ప్రేమతో ముడిపడి ఉంది
కాలం కౌగిట్లో కరిగిన ఒక్కొక్క క్షణం ..అమ్మా!! .
నీ అనురాగ ధారలలోనే తడిసి ముద్దయిపోయింది..!

ఆటల్లో పడి సమయం తెలీకుండా నేనాడి   అలసిపోతుంటే
వందల సార్లు నువ్వు విసుగు లేకుండా నన్ను పిలుస్తుంటే..
అయిష్టంగానే ఇంటికొస్తాను, నీరసంతో నీ ఒడిలో సోలిపోతాను
నువ్వు లేపి ముద్దలు పెట్టే దాకా, మూతి తుడిచి మళ్లీ నిద్ర పుచ్చే దాకా!

అనుకోకుండా ఏ అర్ధ రాత్రో  చదవాలని నేను లేచి కూర్చుంటే
అలసటతో  గాఢనిద్రలోకి జారుకున్న నీకెలా మెలకువొస్తుందో
అంత మగతలోనూ నన్నుత్సాహ పరిచేందుకు ఓపికెలా వస్తుందో
ఆనాడిచ్చిన తేనీటి వెచ్చదనం ఈనాటికీ హృదయాన్ని తాకుతోందిదిగో..

 క్షేమానికై  ఆరాటపడడాన్ని ఆంక్షల చట్రంలో బంధించే యత్నమని భ్రమించి
రెక్కలొచ్చాయన్న ధైర్యంతో రివ్వున ఎగిరిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి
నన్ను వెనక్కి లాగి పొదివి పట్టుకున్నది నీకున్న ప్రేమే తప్ప పంతం కాదని
ఇన్నేళ్ళ తర్వాత అర్థమయ్యాక నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుందెందుకో!

నా జీవితం పూరించలేని సమస్యలా మారి
ప్రతీ ఉదయం భయంతో మొదలైనప్పుడు
వరుస ఓటములతో  ప్రపంచం మసకబారి
ఒంటరితనంతో  దహించుకుపోతునప్పుడు...

ముడుచుకున్న పెదవుల మీద నవ్వులు పూయించిందీ
నా ఉహల చిత్రాన్ని మళ్లీ ఆశల వర్ణాలతో నింపింది నువ్వే!
అపజయాలను దాటుకుని గెలవగల సత్తా ఉందని  నమ్మిందీ
నేను విజేతలా అందరి ముందు వస్తానని విశ్వసించింది నువ్వే !

ఉద్యోగమంటూ  ఒంటరిగా ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడినప్పుడు
వెన్ను తడుతూ నువ్వు వీడ్కోలు చెప్పడానికి వచ్చినప్పుడు
నీ చెంపలను ముద్దాడిన నా పెదవుల నంటిన ఉప్పదనం ......
నీ కన్నీళ్లను దాచిందేమో   కాని  గుండెల్లోని ప్రేమను కాదు !!

నీ అంత ప్రేమను జీవితాంతం పంచే మనిషి కోసం
రేయింబవళ్ళు పరితపించి నాకో సరిజోడు వెదికినా 
నీకు మాత్రం తెలీదా అమ్మా....
నిన్ను మించగల్గిన వాళ్ళు సృష్టిలో ఇంకెవ్వరూ లేరని...ఉండరని....!

*****************         **************************          ****************
published in Koumudi: http://koumudi.net/Monthly/2010/july/index.html       

26 comments:

  1. అద్భుతంగా ఉంది.శుభాకాంక్షలు

    ReplyDelete
  2. నిజంగా అద్భుతంగా ఉండదండీ! పొద్దున్నే కౌముదిలో చూశాను. అభినందనలు. :-)

    ReplyDelete
  3. enta baagundo.....amma antene anni kadaa!!!
    congrats

    ReplyDelete
  4. నా నమ్మకం ఇంకా పెరుగుతుందంతే! :)

    ReplyDelete
  5. simply superb,spell bound :-)
    http://lalithayamini.blogspot.com/

    ReplyDelete
  6. ippude mottam blog chadivi padesa!!! ento me blog add cheskoka tappatam ledu ....hmmmm.
    bagunnayandi mee bhavalu ....keep going for us plz !!!

    ReplyDelete
  7. లోకేష్ శ్రీకాంత్ గారూ..కృతజ్ఞతలు..
    మధురవాణి గారూ..చాలా చాలా థాంక్స్ అండి..మీరు కౌముది మా అందరి కంటే ముందే చూసేసారయితే.
    మంజు గారూ...హృదయపూర్వక కృతజ్ఞతలు.. :)

    ReplyDelete
  8. దిలీప్..!! వచ్చేసావా మళ్లీ బ్లాగ్స్ కి :))..am really glad you read this post and liked it.!

    ReplyDelete
  9. Hey Jags..! welcome back and thank you very much for the appreciation.

    ReplyDelete
  10. సావిరహే గారూ ..ముందుగా మీ ఓపికకి లెక్కలేనన్ని కృతజ్ఞతలు..అన్నీ ఒక్కసారి ఎలా చదివారో ఓపిగ్గా ప్రతి దానికి మీ అభిప్రాయాన్ని ఎలా తెలియజేసారో కాని, మొత్తానికి నా బ్లాగ్ నచ్చినందుకు, అభినందించినందుకు, ధన్యవాదాలు. :):)
    అన్నింట్లోనూ మీరు రాసినవి చదివాను..చాలా సంతోషంగా అనిపించింది. Infact, you made my day..! :)

    ReplyDelete
  11. చాలా బాగుంది...

    ReplyDelete
  12. hahhaahahaha.........

    నీ చెంపను ముద్దాడిన నా పెదవుల నంటిన ఉప్పదనం ......
    కన్నీళ్లను దాయగలిగిందేమో కాని నీ గుండెల్లోని ప్రేమను కాదు !!

    ikkada bhavam chaala baaga anipinchindi.........

    correctga padaalu padaledu ani naaku anipinchindi.to be frank emee anukovaddu naaku kadhala anipinchindi.

    ReplyDelete
  13. mee kavithalu Really superb....This is Kishore. Azeez's friend.

    ReplyDelete
  14. మానస గారు, మీరు నిజంగా గ్రేటండి, మీ కవితలు చదివినప్పుడల్లా నా చిన్ననాటి రోజులు గుర్తుకువస్తాయి....ఇది మనకు జరిగిన, జరుగుతున్న అనుభవమే ..కవిత రూపంలో మానసగారి మనసునుండి వచ్చింది అనిపిస్తుంది, మీరు పొగడ్త అనుకోకపోతే నేనొక మాట చెప్తాను.. "మనుషుల మనసులు ఎరిగిన మనసు కవయిత్రి మా మానసగారు"

    ReplyDelete
  15. Hi Vinay ..Thanks and I respect your opinion..

    ReplyDelete
  16. కిషోర్ గారూ,
    కృతజ్ఞతలు..
    వంశీ గారూ, thank you :)
    anta baaga raayagaligite ika lenidemundi.. - I need to improve a lot.. :)

    ReplyDelete
  17. Hi Manasa, this is Priya. new to this blog.

    i am really impressed by your kavithas.. "Ekanthamo.. Ontaritanamo.." and "Amma .. Ninu Vina.."
    Chaduvutunte, manansu lothullo nunchi teleni aanandam n oka sunnitamaina bhavaalu nanu kadilinchayi.. Priya

    ReplyDelete
  18. hey idi chala bagundi ...amma meeda rasina kavitha...i am really feltso happy ..when i read this one :-)

    ReplyDelete
  19. HI Priya - Thank you very much
    Lalli - Thanks a lot..I am glad you liked it.:)
    I dedicate this poem to my mom..who is my strength in life! :)

    ReplyDelete
  20. అపురూపంగా చూసుకుందామని తనకోసం తయారు చేసుకున్న ఒక గాజుబొమ్మని అనుకోకుండా చెయ్యి జార్చుకుని ఉంటాడండి బ్రహ్మ....అది ప్రాణం పోసుకుని మానసగా మారి కవితలతో మా మనసులు పిండేస్తుంది

    ReplyDelete
  21. నీ అంత ప్రేమను జీవితాంతం పంచే మనిషి కోసం
    రేయింబవళ్ళు పరితపించి నాకో సరిజోడు వెదికినా
    నీకు మాత్రం తెలీదా అమ్మా....
    నిన్ను మించగల్గిన వాళ్ళు సృష్టిలో ఇంకెవ్వరూ లేరని...ఉండరని.
    అమ్మ మీద ఎన్ని కవితలు చదివినా, రాసినా తనివి తీరదు.

    ReplyDelete
  22. kavithalannee chaalaa baagunnaayi. annee chaduvutunnaanu.wonderful manasaa! aparna cheppindi nee blog gurinchi..yenduko yenni rojulugaa try chestunnaa open avatle..ninna nuvvu pampina link maatram perfect gaa panichesindi..inkaa boledanni manchi rachanalu cheyyalani korukuntunna

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. ఆమ్మ తన బిడ్డని హృదయానికి హత్తుకున్నంత తీయగా
    అమ్మ లాలి పాటలో బిడ్డ నిద్ర పొతున్నంత హాయిగా ఉంది మీ కవిత

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....