మళ్ళీ మళ్ళీ నిన్నే...


పగలంతా నువ్వు లేని క్షణాలని గడపి
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని భరించి
కన్నీళ్ళను గుండెల్లో దాచి
నవ్వులు పులుముకు తిరిగాను..

మనసుకో ఓదార్పు మాట చెప్పి
వీడ్కోలు తప్పదని నచ్చజెప్పి
నీ తలపులనన్ని తిప్పికొట్టి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..

మన గొడవలెంత బాధో రాసుకున్నాను
నీ మౌనానికెలా తల్లడిలానో తల్చుకున్నాను
మూసేసిన మనసు తలుపుల ముందు,
దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను

తీరా రాతిరయ్యే సరికి
కలల దుప్పటి కప్పుకుని,
కలిసిపోయామని భ్రమించాను!
మళ్ళీ మళ్ళీ నిన్నే ప్రేమించాను!


8 comments:

 1. చాలా చాలా బాగుంది మానస గారు..
  "మూసేసిన మనసు తలుపుల ముందు,
  దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను " అద్భుతం..

  ReplyDelete
 2. Too good మానస గారు మీ కవిత...
  మంచి ఫీల్ నిండుంది ఈ కవితలో!

  మనసుకో ఓదార్పు మాట చెప్పి
  వీడ్కోలు తప్పదని నచ్చజెప్పి
  నీ తలపులనన్ని తిప్పికొట్టి
  ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..

  ఎన్నెన్నో పాత ఏడుపుల కన్నీటిని గుర్తుచేశారు!

  ReplyDelete
 3. తీరా రాతిరయ్యే సరికి
  కలల దుప్పటి కప్పుకుని,
  కలిసిపోయామని భ్రమించాను!

  loved this expression

  ReplyDelete
 4. పగలంతా పులుముకున్న నవ్వులు,
  ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్పులు,
  రాతిరికి కలిసున్న కలల భ్రమలు,
  మూసేసిన మనసు తలుపు ముందు మానని గాయాలతో,మాసిపోని ప్రేమతో. Great expression manasa gArU.

  ReplyDelete
 5. అలా గతపు ద్వారాల్ని తెరిపించారు నా చేత..:)

  ReplyDelete
 6. మూసేసిన మనసు తలుపుల ముందు,
  దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను

  అందుకే నేనంటాను మనిషి మనసు తెలిసిన మానస పుత్రిక మా మానస గారు అని.......

  ReplyDelete
 7. మిత్రులందరికీ ధన్యవాదాలు!
  కొన్ని కొన్ని భావాలు అందరిలోనూ ఏవో జ్ఞాపకాలను తట్టిలేపే తీరతాయి.

  ReplyDelete
 8. మూసేసిన మనసు తలుపుల ముందు,
  దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను
  too good

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...