మరో తోటలోకి...


మెలకువొచ్చేసరికి ఈ తోటలో..

నాలుగు దారులు, నాలుగు కూడళ్ళు.
 
ఏ దారిలో ఏ పూవులెదురొస్తాయో
ముందే తెలిసిన వాళ్ళెవరుంటారనీ?
ఏమీ వెంటతేని చేతులకూ ఆశలెందుకో
ఏనాడెవరాలోచించారనీ?
 
దారులు,మలుపులు..
దాహాలూ మోహాలూ
దోసిట్లో అయాచితంగా..
రాసుల్లా రాలిపడే బహుమానాలు.
 
పరుచుకునే చీకట్లలో మసకబారే మార్గాల్లో
వెంపర్లాట దోచుకున్నది సమయమొకటేనా?
బరువెత్తే భుజాల్తో సాగిపోయే ప్రయాణాల్లో
గాడిద కూలిపోయేదా గడ్డిపోచ బరువుకేనా?
 
మూసిన గుప్పెళ్ళని వదిలేయడమో
మూతలు తెరవని సంచీలిక విసిరేయడమో
తప్పనిసరి నడక కదా,
ఇప్పుడే ఇక్కడే తేలాలి, తేలికపడాలి.
 
ఆఖరు అడుగు పడే వేళకి
అమృతపు చుక్కొక్కటి దొరికినా...
మళ్ళీ రానీ తోటలోకి.


 ****************************

                                             
ఇది నిజానికి ఏప్రిల్ నెలలో నేను బ్లాగులో ప్రచురించిన ఒక "Raw thought" కు కవితా రూపమిచ్చే ప్రయత్నం. నిన్న ఏమీ తోచక ఈమాటలో సాహిత్య వ్యాసాలు చదువుతూంటే, 2006 లో అఫ్సర్‌గారు వ్రాసిన ఈ వ్యాసం కనపడింది. చాలా ఆసక్తికరంగా అనిపించడంతో, అప్పటికప్పుడే అంతర్జాలంలో వెదికి, మిగిలిన పది ఉత్తరాలూ ఏకబిగిన చదివేశాను. ఆ కుర్రకవి ఉత్సాహం చూస్తే, నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది :). మనసులో ఉన్నది కాగితం మీద యథాతథంగా రాదేమిటని బెంగటిల్లిన అతని తత్వాన్నిత్వరగానే అర్థం చేసుకోగలిగాను. ఆ హుషారులో, నేను ఏప్రిల్ నెలలో వ్రాసుకున్న పాతప్రతి - అప్పటి నుండి నాలో నాకు అసంతృప్తులు కలుగజేస్తూనే ఉంది కనుక, ఈ పూటకి " రిల్కే" నా గురువు అనుకుంటూ, మొదటి ఉత్తరంలోనే చెప్పిన పాఠాలను మనసులో ఉంచుకుని...మార్చుకు వ్రాసుకున్నాను.

ఆసక్తి గలవారి కోసం, Rainer Maria Rilke గురించి వికి వ్యాసం ఇక్కడ.
అతను ఔత్సాహిక కవికి వ్రాసిన లేఖల సంపుటి, "Letters to a Young Poet"  ఇక్కడ. 

17 comments:


 1. and...'miles to go before I sleep' అంటారనుకున్నా :)
  బ్లాగులకి అన్వయించుకుంటే చాలా సరిపోతోంది మనసా!

  ReplyDelete
 2. ఎంత బాగారాసారో.

  ReplyDelete
 3. jeevitham kalala karigi potunna..repati voohale prathi adugulo

  adugulu aipoyaka venukativannee nitturpule..

  JEEVITHA DAHANNI CHAKKAGA CHEPPARU

  ReplyDelete
 4. ఎలా వచ్చానో ....ఎందుకో ఆలోచించాను .బాగుంది

  ReplyDelete
 5. Manasa.. you are amazing...

  అద్భుతం అంతే.. అంత బాగుంది కవిత. నిన్ను చూస్తే ఈర్ష్య కలుగుతుంది :P

  ReplyDelete
  Replies
  1. First things first, A warm welcome back to the world of blogs, my dear proud mother :p

   and..- Thank you :-) Feels so good to see you back here.

   Delete
 6. Excellent!

  Krishna

  ReplyDelete
 7. Hello Manasa ..

  How are you .. Hope your doing great ..

  Its been long time since i read your poetry ... I felt very good after reading this ... entho peaceful gaa undi ..idi chadivakaa ....

  ReplyDelete
 8. Manasa Chatrathi గారు..చాలా బావుంది మీ కవిత...మీకు నా అభినందనలు...

  ReplyDelete
 9. Superb Manasa :)

  ReplyDelete
 10. చాలా బావుంది మానస గారు. 'వెంపర్లాట దోచుకున్నది సమయమొకటేనా?' నిజమే కదా.

  ReplyDelete
 11. Ee madhyane chadavadam modalu pettanu mee blog. chaala baga akshra rupam istharu mee feelings ki. I liked it

  ReplyDelete
  Replies
  1. వెన్నెలస్నేహితా...థాంక్యూ...! :-)

   Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....