ఒక్కో రోజు


అరవిరిసిన పూవులేవో మంచు మత్తులో తూలుతూండగానే
మసక వెన్నెల వానలో లోకమింకా తడుస్తూండగానే
విశాల శాద్వలాల్లో స్వప్నసంచారాన్ని అకస్మాత్తుగా ముగించి
దేని కోసమో దిగులుపడుతూంటుంది హృదయం
జీవన పయనాన్ని లయగా నడిపించే
నిర్వికల్ప సంగీతమేదో ఆగిపోయినట్లై
సంకల్ప వికల్పాలన్నీ ముళ్ళుపడుతుంటే…
కాలపు కుండకు చిల్లులు పెట్టి
అట్టడుగున పేరుకున్న అనుభవాలేమిటని
దోసిలితో పైకెత్తి చూస్తాను
మానస సరోవరాన స్వేచ్ఛగా మసలే
రాజహంసల సమూహాలను దాటుకుని
లోతులను తాకే ప్రయత్నమొకటి చేస్తాను
ఏదో రహస్యం.. అర్థమయ్యీ కానట్టు
ఏదో వెలుగు లోలో మిణుకు మిణుకుమంటూ
ఇన్నాళ్ళెందుకు సాగిందీ ప్రతీక్ష!
జీవితం పునరావృతమవుతున్న పురాగీతమేనన్న స్పృహ కలిగాక
చరణాల మధ్య నిశ్శబ్దమెందుకో తేలిగ్గానే తెలిసొస్తుంది
ముందు వెనుకలకు కాని మలి ప్రయాణం మొదలయ్యాక
లోలోపలి లోకాల్లో సంగీతం తిరిగి నిండుగా పరుచుకుంటుంది.
________________________
**తొలి ప్రచురణ.. ఈమాటలో.

20 comments:

  1. "నిర్వికల్ప సంగీతమేదో ఆగిపోయినట్లై
    సంకల్ప వికల్పాలన్నీ ముళ్ళుపడుతుంటే .… "
    చాలా బావుంది.
    అభినందనలు మానస చామర్తి గారు. శుభోదయం!

    ReplyDelete
  2. కాలపు కుండకు చిల్లులు పెట్టి
    అట్టడుగున పేరుకున్న అనుభవాలేమిటని
    దోసిలితో పైకెత్తి చూస్తాను_____________________ అబ్బ, ఎంత బావుంది మానసా ఇది !!

    ReplyDelete
  3. ఇది నేనింతకు ముందే చదివినట్టు అనిపిస్తోంది. ఎక్కడైనా పబ్లిష్ చేశారా ముందు?

    ReplyDelete
    Replies
    1. Yes sir. We already discussed this offline in mails. Published in EEmata November Edition

      Delete
    2. Okay! గుర్తొచ్చింది మేడమ్! :)

      Delete
  4. జీవన పయనంలోని సంఘర్షణను, వైరుధ్యాన్ని చక్కగా అక్షరీకరించారు. కవిత బావుందండి. అన్నట్టు చివర్లో, ‘‘జీవితం పునరావృతమవుతున్న, ముందు వెనుకలు కాని మలి ప్రయాణం‘‘ అన్న దగ్గర... ఎందుకో, జీవితం మునుముందుకు పురోగమిస్తున్న ప్రయాణం కదా అనిపించింది. నిన్నటి నుండి నేటికీ, నేటి నుండి రేపటికి నిరంతరాయంగా మార్పు చెందుతూ ముందుకెళుతున్నసమాజాన్ని, సమాజంలో మనిషి జీవనాన్ని గమనించినప్పుడు జనరల్ గా అలా అనిపించింది. నిజం నిలకడ మీద తెలుస్తుందేమో :-)

    ReplyDelete
    Replies
    1. Thank you Nagaraj garu. :-)
      ముందు వెనుకలకు కాని మలి ప్రయాణం" అనటంలో నా ఉద్దేశ్యం...ముందుకూ వెనక్కూ కూడా కాదు - లోలోతులకు అనండీ..మన లోపలి వెలుగునో, చీకటినో మరింత స్పష్టంగా గమనించే కొద్దీ.... "లోలోపలి లోకాల్లో సంగీతం తిరిగి నిండుగా పరుచుకుంటుంది" అని వ్రాశాను. I hope this helps.

      Delete
    2. అలాగే పునరావృతం అన్నప్పుడు కూడా..

      మనమెటు వెళ్తున్నా, నిజానికి జీవితమదే. అదలాగే ఉంటుంది. అవే బాధలు, లేదా అవే సంతోషాలు. అవే ఉత్సాహాలు, లేదా అవే నిరాశలు. సుఖం వెనుకే గుండె బద్దలయ్యే దుఃఖం , మళ్ళీ వెంటనే మరపించేందుకే విజయం - ఓ గర్వం. ఏ జీవితమైనా ఇంతేగా..! ఈ లెక్క తెలిస్తే...ఒక ఖాళీ తరువాతా ఏమొస్తుందో ఏ దేవుణ్ణీ బతిమాలక్కర్లేకుండానే మనకు తెలిసిపోతుంది. ఒక గాఢమైన అనుభూతి నుండి మనమెలా మెల్లిగా దూరం జరిగామో - వెనక్కి తిరిగి చూసుకుంటే - మన జీవితమే విప్పి చెప్తుంది.

      మనకు సంగీతమంతా ముందే తెలిసిన పాట వస్తోందనుకోండీ - పల్లవి తరువాత ఏముందో..చరణం మధ్య ఏ సంగీతం వస్తుందో మనకు తెలుస్తుంది కదా..అప్పుడు గీతం పూర్తయ్యిందని మధ్యలో లేచి నిలబడం, చప్పట్లు కొట్టం, వెళ్ళిపోం. తరువాతి చరణం కోసం - ఆ మౌనంలోనే నిరీక్షిస్తాం. ముందు రాబోయే కొత్త సంగతుల కోసం ఆసక్తిగా తాళం వేస్తూ ఎదురు చూస్తాం; అవునా? ఈ జీవితమూ అలాంటిదేనని చెప్పే ప్రయత్నమిది. అంతే. Just my humble thoughts

      థాంక్యూ!

      Delete
    3. బావుంది మీ వివరణ.
      జీవన గమనం తాలూకు ద్వంద్వాల్ని, ద్వైదీభావాన్ని మీరు చక్కగా ఒడిసి పట్టుకున్నట్టున్నారు.
      కానీయండి, అప్రతిహతంగా సాగిపోండలా!

      Delete
  5. పదాల అల్లిక బాగుంది మానస గారు :)
    నాకు అర్థం అవ్వాలంటే ఇంకో పది సార్లు చదవాలి, (మరి మట్టి బుర్ర కదా,) చదివాక మళ్ళీ వస్తా :))

    ReplyDelete
    Replies
    1. Hey ! Great to hear from you after a long long time. Thank you! :)
      and please, don't be so humble :p

      Delete
  6. manasa gaaru...ee kavithanu ardham chesukovadaaniki Oka five times chadivuntaanu...ardham ayina tharvatha enni times chadivaano naake teliyadu...adbuthaha :-):-)
    superb..superb..awesome :-):-)

    ReplyDelete
  7. super really great manas garuuuuuuuuuu very nice i want to continue to read without break ra very nice proud of u manas

    ReplyDelete
    Replies
    1. Thank you so much , Aunty. It's a pleasant surprise to hear from you on this Saturday.

      Delete
  8. Amazing! Hw come i missed all these...
    I am reading twice....good poetry.
    శాద్వలాల్లో....ante artham?

    ReplyDelete
    Replies
    1. Thank you Anu.
      Sadvalam ante..pacchika kaladi ani arthamandee...

      pacchika maidaanam anukovacchemo..

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....