వాన వెలిశాక..


విరగబోయే కొబ్బరిమట్ట మీద కూర్చుని
ముక్కుతో పొట్ట పొడుచుకుంటూ
దిగులుగా ఊరంతా చూస్తుంది
ఒంటరి కాకి

డాబా మీది తూము నుండి నీళ్ళు
ధారల్లే క్రిందకు పడుతోంటే
తలంతా తడుపుకుంటూ ఇకిలిస్తాడు
బట్టల్లేని బుడతడు


దండేనికి వేలాడుతోన్న చినుకులన్నింటిని
చూపుడువేలు గాల్లోకి విసిరేశాక
ఏడుపు మొహాలతో బయటకొస్తాయ్
ఆరీఆరని బట్టలు.


జీరాడే కుచ్చిళ్ళు జాగ్రత్తగా
బురద నీళ్ళకు దూరంగా జరిగాక
పసుపు మరకల పట్టీలతో పేరంటానికెళ్తుంది
అమ్మలాంటి ఓ అమ్మ.


వానపడ్డంతసేపూ బుడబుడా నవ్వుతుంది, ఈ నేల
ఆ కాస్త ప్రేమకే మెత్తబడి కరిగిపోతుంది
ఎంత బాధ లోలోపల కొంపుకుంటుందో,
వాన వెలిశాక అదేపనిగా కళ్ళు తుడుచుకుంటుంది.


* తొలి ప్రచురణ వాకిలి సెప్టెంబరు, 2014 సంచికలో

7 comments:

 1. ha hahha....maa vooru , illu anni okkasari kanipinchai. Bavundi.

  ReplyDelete
 2. పసుపు మరకల అమ్మ లాంటి అమ్మ పట్టీలు బావునబాగున్నాయి :)

  ReplyDelete
 3. వర్షం వెలిసాకా హర్షం పలు దృశ్యాలంకరణల ద్వారా ప్రస్ఫుటం కావడం కవితకు విశేషాలంకారం.

  ReplyDelete
 4. Bhale vundi antaa chuustunnattu
  Radhika(nani)

  ReplyDelete
 5. Enduko ee kavitha chaduvutunte SriSri gari Sandhya samasyalu gurthukocchindi....

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...