రహస్యముగా....


మొండితనం మన ప్రమేయం లేకుండా మాటలతో కలబడితే
అల్లరి అలక హద్దులు చెరుపుకు కోపపు ముసుగుల జొరబడితే
రాతిరంతా తలలొంచిన నక్షత్రాల మౌనపు గుసగుసలే తప్ప
మనసులు ఊసులాడుకోవని - అప్పుడు ఊపిరాడదనీ తెలీదు.

కంటికి కనపడని గోడలేవో అడుగడుక్కీ అడ్డు పడుతున్నప్పుడు
తప్పొప్పుల తక్కెడ ముద్దాయిని చేసి తల దించమన్నప్పుడు
చుబుకాన్నెత్తి నుదిటిని తడిమిన నీ వెచ్చటి చేతి స్పర్శలో
అనురాగమొకింత తగ్గినట్లుండడం భ్రమేనేమో తెలీదు

కలవరం సద్దుమణిగి - కంటి ఎరుపులోని కోపాలు కరిగి
తపించే వెర్రి హృదయపు బెంగ బాధగా భారంగా మారినపుడు..
నవ్వులు పూయని శూన్యంలో..వెలుతురు సోకని లోకంలో
మళ్ళీ నిను చేరేందుకు నిరీక్షించాలో అన్వేషించాలో తెలీదు.


అదృష్టం వరమిచ్చి ఏ గుమ్మంలోనో ఎదురెదురు నిల్చినపుడు
విచ్చీ విచ్చని  పెదవుల కళ్ళూ కన్నుల పెదవులూ
అహాలనూ అపోహలనూ కరిగించే అమృతవర్షమే కురిపించినపుడు


నే మునివేళ్ళపై నిలబడేదెందుకో నీ పెదవులకు తెలుసు.
సిగ్గిలి జాబిలి మబ్బుల దాగుతుందని చీకటి రాతిరికీ తెలుసు.

రేయంతా సాగిన రహస్యపు జాగారాల్లో పరవశించిన క్షణాల్లో
కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చేస్తుందని తెల్సు
దోసిలి ఒగ్గి అవన్నీఅపురూపంగా అందుకోవాలని అవనికీ తెలుసు!

25 comments:

  1. "కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చేస్తుందని తెల్సు
    దోసిలి ఒగ్గి అవన్నీఅపురూపంగా అందుకోవాలని అవనికీ తెలుసు!"

    చాలా చాలా బావుంది.

    ReplyDelete
  2. చాలా బాగుందండీ! అప్పుడు.... తరువాత భావం చాలా బాగుంది!

    ReplyDelete
  3. కలతలు కరిగి.. కాలం మాయమై.. పారిజాతపరిమళంగా జాలువారిందన్నమాట.

    మనసులో రేగిన సున్నితమైన భావాల్ని సూటిగా చాలా విపులంగా చెప్పారు. చాలా చాలా బావుంది.

    ReplyDelete
  4. మధురా...థాంక్యూ సో మచ్. :)
    జ్యోతిర్మయి గారూ - ధన్యవాదాలండీ..!
    రసజ్ఞ - :) అప్పటికి మునుపో మరి ? :)- ధన్యవాదాలు.
    శ్రీకాంత్ : చాలా రోజులకు కనిపించారు, మీ స్పందనకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  5. గీతిక గారూ : కాల్పనిక జగత్తులో అద్భుతాలకు కొదవేముంటుంది. నా సరదా ఊహకికిచ్చిన అక్షరాల్లో అసలు భావాన్ని అందుకున్నదుకు, మీ చక్కటి ప్రతిస్పందనకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  6. చాలా చాలా బావుంది.

    ReplyDelete
  7. చాలా చాలా బావుంది.

    ReplyDelete
  8. puvuluralesavvadi vini
    nee vee anukunna..
    eppatilane kanipistavani
    prahi vasanthamlo...

    ReplyDelete
  9. puvuluralesavvadi vini
    nee vee anukunna..
    eppatilane kanipistavani
    prahi vasanthamlo...

    ReplyDelete
  10. శివ గారూ : కృతజ్ఞతలండీ..!
    విజయ్ గారూ : అంతే కదా మరి .."నిరంతరమూ వసంతములే..." :). ధన్యవాదాలు.
    పవన్ : :-)

    ReplyDelete
  11. చాలా బాగుందండీ

    -->రెండు జతల కళ్ళూ రెప్పలేయడం మరిచిన ఆ క్షణంలో
    నే మునివేళ్ళపై నిలబడేదెందుకో నీ పెదవులకు తెలుసు.
    సిగ్గిలి జాబిలి మబ్బుల దాగుతుందని చీకటి రాతిరికీ తెలుసు.

    excellent-- భాష మీద మంచి పట్టు ఉంది మీకు

    ReplyDelete
  12. కవిత్వాన్ని చదివి ఇలా మైమరిచి చాన్నాళ్ళయింది. ప్రతీ పదం పొందికగా అర్థవంతంగా వాడారు. బాగుంది మానస గారూ! శీర్షిక ఇంకా బాగుండవచ్చ నిపించింది

    ReplyDelete
  13. కొత్తావకాయ గారిదే నా ఫీలింగ్ కూడానండీ! ప్రతిపదమూ అర్థవంతంగా ఎన్నుకుని రాశారు. జోహార్లండి.

    ReplyDelete
  14. మొత్తం అంతా నెమ్మదిగా పదము పదమూ చదువుతూ వచ్చి ఆఖరి రెండు లైన్లూ చదువుతూనే 'ఆహా' అని అప్రయత్నంగా నా నోటివెంట వచ్చేసింది, మానసా!! just BEAUTIFUL!!

    ReplyDelete
  15. అలకలు,మౌన యుద్దాలు .. మమతల పందిరి నీడన ఓడిపోయినప్పుడు.. ఎవరు ఎవరికి చేరువవతారో.. చెప్పడం కష్టమైనప్పుడు.. గెలుపెవరిదో..ఆడినది ఎవరో..మరచినప్పుడు.. మాటలకు.. సమయమే లేదు

    .రెండు జతల కళ్ళూ రెప్పలేయడం మరిచిన ఆ క్షణంలో
    నే మునివేళ్ళపై నిలబడేదెందుకో నీ పెదవులకు తెలుసు.
    సిగ్గిలి జాబిలి మబ్బుల దాగుతుందని చీకటి రాతిరికీ తెలుసు.
    "సిల్సిలా" చిత్రంలో.. నాకు చాలా ఇష్టమైన ఒక దృశ్యం కనులముందు కదలాడింది.
    మానసా గారు.. అద్భుతమైన అనుభూతిని వ్యక్తీకరించారు. అభినందనలు.

    ReplyDelete
  16. "కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చేస్తుందని తెల్సు
    దోసిలి ఒగ్గి అవన్నీఅపురూపంగా అందుకోవాలని అవనికీ తెలుసు!"

    అద్భుతం మానసగారూ :D

    ReplyDelete
  17. Nishi - What a pleasant surprise; Thanks heaps !

    వనజ గారూ : ధన్యవాదాలండీ, మీ నిండైన వ్యాఖ్యతో నా కవితను మళ్ళీ కొత్తగా చూపెడుతున్నారు :)

    మురళీ - :)థాంక్యూ థాంక్యూ..!

    ReplyDelete
  18. Excellent!! Naa collectionlo daachukuntaa...
    I wish u write many more....

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....