శమన

నువ్వున్నట్టుండొక 
మెరుపువై వణికినా

నే నిలువెల్లా జ్వలించి
ఒకే ఆలోచనై చలించినా 

ఎంత అలజడి!

చినుకుల్లా కురిశాక
నీలోనూ,
కవిత్వమై కరిగాక
నాలోనూ..

      ఆకాశమా!
తేలికపడ్డాక
ఎంత ప్రశాంతత.

15 comments:

  1. అబ్బా... ఇంత చిన్నిచిన్ని పదాల అల్లికతో, అంతంత పెద్ద భావాల్ని గుదిగుచ్చి, ఇంత అద్భుతంగా ఎలా రాస్తారండీ అసలూ??? తలక్రిందులుగా ఓ పదేళ్లు ముక్కు మూసుకుని తపస్సు చేసినా ఇలాంటి మంచి పదాలు అస్సలు తట్టకు నా మట్టి బుర్రకైతే. సింప్లీ సూపర్బండీ. థాంక్యూ :-)

    ReplyDelete
    Replies
    1. well said.. nenu kood aanthee..naa valla kaadhuu to write .. even a small poem..

      Delete
  2. నాగరాజ్ గారూ - మీ మంచి మాటలకు ధన్యవాదాలండీ! :). ప్లస్‌లో మీ సరదా మాటలు చదువుతూనే ఉంటాను.

    రోమియో, రాధికగారూ - ధన్యవాదాలు.

    సుదీప్ - :) అవునవును, నిన్నిక్కడికి లాక్కొచేందుకు కూడా ఉపయోగపడ్డాయే!;) మంచి వానలే! Thanks dost!

    ReplyDelete
  3. Eanta andam ga rasaru mam awesome

    ReplyDelete
  4. Hayiga, prashantham ga chala bavundi haiku

    ReplyDelete
  5. చిన్న చిన్న పదాలతో గొప్ప భావాన్ని ఆవిష్కరించారు .బావుంది.

    ReplyDelete
  6. Really superb... Vaana,raa! ,mohanamakarandam... enta baagunnaayoo...:):)

    ReplyDelete
  7. చక్కని కవిత మానసా.

    ReplyDelete
    Replies
    1. నేను కూడా డిట్టో తెలుసా...

      Delete
  8. * Thank you dear Prasuna.

    * Rao Garu - Thank you.

    ReplyDelete
  9. Aaahhhhhh... Oke varshanni chusi, rendu parswaalaa??? Maanasaa nuvvu chaaalaaaa ettulo unnavu. Cheyyanna andincharaduu nee manasu lotullo bhaavalni dongilinchestaa:))))

    Typing from mobile so couldnt do in telugu. Sorry for that.

    ReplyDelete
    Replies
    1. :)) మీరు బ్లాగులో వ్రాయడం మొదలెడితే మరింకెక్కడా దొంగిలించక్కర్లేనన్ని ఆలోచనలు ఎదురొస్తాయ్ కానీ, థాంక్యూ! :)

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....