ఈ క్షణం..

దారి తప్పాను
ఈ అడవి మధ్యన
సెలయేటి ఒడ్డున
వెదురు ఇల్లు నాకోసం
దాచి ఉంచారెవరో!
ఖాళీ కుర్చీలు, ఖాళీ అయిన పాత్రలు
కొన్ని ధూళికణాలతో గోడ మీది బొమ్మలు
ఏనాడో మరచిన ప్రియగీతిని వినిపిస్తూ
వాకిట్లో ఊగే గాలిగంటలు, వాటితో పాటే,
దడి దగ్గరే దోగాడుతూ
ఎవరూ కోయని పూవులు
సెలయేటి గాలులు, అవి తాకినపుడల్లా
రాతిరి చలిమంటలో నుండి
ఇంకా చల్లారక రేగుతోన్న నిప్పురవ్వలు
అడవిలో ఏ వైపునో నక్కి, ఆగీ ఆగీ
ఆత్రంగా పిలుస్తోన్న అడవి పక్షులు
సమయమెంతైందో తెలీదు.
 సర్రున పరదా లాగినట్టు,
లోకమంతా స్వర్ణకాంతులు
నిన్న ఇక్కడెవరున్నారో,
రేపింకెవరు రానున్నారో,
ష్ష్...
ఏమీ చెప్పద్దు
ఈ స్వర్గం
ఈ క్షణం
నాది!

4 comments:

  1. As usual Excellent.

    ష్ష్... ఏమీ చెప్పద్దు ఈ స్వర్గం ఈ క్షణం నాది! అని స్థాణువులా ఆనందంలో మునిగి నిలబడినట్లు అనిపించింది. Wonderful. చదవటం మీ కవిత్వానికి దగ్గరగా ఉన్న పాత కృష్ణా వాణిశ్రీ పాట గుర్తొచ్చి వెతికాను.

    https://www.youtube.com/watch?v=DI2Wn1DgNVs

    ReplyDelete
    Replies
    1. Thank you so much, Sriram.
      ఈపాట మొదటిసారి విన్నాను, బాగుంది :)).


      Delete
  2. excellent manasagaru.mi kavithalu follow authuuntanu..very nice

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....