శిక్ష

ఏ తీగను నమ్ముకునో,
ఉత్తరమొకటి వచ్చి నా ఒళ్ళో వాలింది.

కాలం ఏం చేసింది!

సంబోధనలు మార్చేసింది.
సంతకాలు మార్చేసింది.
ఒకప్పటి చివరిమాట, ఇప్పుడు
మొదటిమాట అయిపోయింది.
అక్కడితో, ఆ ఒక్కమాటతో,
ఉత్తరమే ముగిసిపోయింది.

కలిసిపట్టుకున్న సీతాకోకచిలుక
వేలు ఒకటి కదిలినందుకే
ఎగిరి ఎటో వెళ్ళిపోయింది
అడుగడుక్కీ పూలు పరిచి
నడిపించిన దారేమో
కాలు కాస్త బెసికినందుకే
నడిమినున్న అగాధాన్ని చూపిస్తూ చీలిపోయింది

ప్రేమ మాటెందుకు?
పదిలంగానే ఉండుంటుంది.
హృదయాలు మారితే ఏమి?
మనుషులు మారితే ఏమి?
ఎవరో ఒకరి గుండెలో ప్రేమ,
ఎవరో ఒకరి గుప్పెట్లో నువ్వూ..

జారిపోతున్న ఇసుకను
జాగ్రత్తగా పట్టుకోవడం తెలీని పాపానికి
పచ్చిపుండులా వేధించుకు తినే జ్ఞాపకమొక్కటే
శిక్ష!

Comments

 1. కొన్నిసార్లు మనిషికి అతిపెద్ద శిక్ష మరిచిపోలేకపోవడమే అన్న పచ్చి నిజాన్ని చక్కని కవితలో గుర్తుండిపోయేలా చెప్పావు!

  ReplyDelete
 2. నచ్చాయి మీ ఈ లైన్లు - - అన్నిటికన్నా ఇంకొంచెం ఎక్కువగా :)

  "ఎవరో ఒకరి గుండెలో ప్రేమ,
  ఎవరో ఒకరి గుప్పెట్లో నువ్వూ.."

  ReplyDelete
 3. Thank you AB :)
  Lalitha TS - Thanks a lot :D

  ReplyDelete
 4. జారిపోతున్న ఇసుకను
  జాగ్రత్తగా పట్టుకోవడం తెలీని పాపానికి
  పచ్చిపుండులా వేధించుకు తినే జ్ఞాపకమొక్కటే
  శిక్ష!

  నిజమే... చాలా బాగుంది

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మెహెర్ కు అభినందనలు..

అమ్మ వెళ్ళిన రాత్రి

పలుకుసరులు (చిన్నపిల్లల కోసం తెలుగు పద్యాలు)

మే రెండో ఆదివారం వంకన..

నాకు యశోద అంటే అసూయ!!