ఇప్పుడంతా ...

డెస్క్ దగ్గర కూర్చుంటే,
కళ్ళకడ్డం పడుతూ -
స్టికీ నోట్స్.

చెయ్యాలనుకున్నవీ, చెయ్యలేకపోతున్నవీ.
అడుగున ఎక్కడో నీ సంతకం. 
మాటలతో పనిలేని గురుతులూ.

"నీకేమైందసలు?" 

ట్రిప్ అడ్వైజర్స్, గ్రూప్ ఫొటోస్
అరణ్యాలు, సముద్రాలు
పగలో రాత్రో, నిద్రపోని ఆకాశాలూ
నీ కళ్ళల్లో..

"ఏయ్! ఎక్కడున్నావ్" 

*
"ఎట్లా తయారయ్యావో తెలుసా!?" 

అడుగులకడ్డం పడే బొమ్మలు
పిల్లాడి అల్లర్లకి కుదురుకోని ఇల్లు. 

అద్దం మీద 
రవ్వలురవ్వలుగా రాలిపడే మంచు
ఎదురుగా నువ్వు. 

లోకం మన్నిస్తుంది. 
నిన్నూ నన్నూ,
ప్రేమనూ..

*

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. స్టికీనోట్స్ గురించి ఎప్పుడూ నేనదే అనుకుంటానండి.
    ఇవి చరిత్ర రాయలేని చేతులు చమత్కారంగా రాసుకున్న వాస్తవాలని..

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....