ఘర్షణ

పాడలేని పాట
తోడురాని దారి
కవ్వింపులాగవు.
నలిగే మనసు
గుచ్చుకునే పూలు
ముద్దుపెట్టే ముళ్ళు
తప్పుకుపోనీయవు.
రగిలే వయసు
కలల పంతాలు
వంతుల జీవితాలు
కలువవెన్నటికీ.
మరిగే ప్రాణం
ఫలించీ ఫలించని అన్వేషణల్లోనే
ఘర్షణ.
అగ్గిరాజుకునే దాకా
తెలుసుగా, అసహనం నేరం. 

6 comments:

  1. >>ఫలించీ ఫలించని అన్వేషణల్లోనే ఘర్షణ.

    చక్కగా చెప్పారు. ఇదేగా జీవితమంటే..

    ReplyDelete
  2. డేవిడ్ గారూ, ధన్యవాదాలు.
    శ్రీకాంత్ గారూ, అవునండీ, "bitter part of life leading to a better life" అనాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ..ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Chaalaa chaalaa bagundi Manasa gaaru:-):-)

    ReplyDelete
  4. కార్తిక్, వెంకటరాజారావు గారూ, ధన్యవాదాలండీ!

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....